కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చీతా: ఇద్దరు పైలట్లు మృతి
భాతర సైన్యానికి చెందిన హెలికాప్టర్(Army helicopter Cheetah) గురువారం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బొమ్‌డిలా సమీపంలో కుప్పకూలింది.
ఈటానగర్: భాతర సైన్యానికి చెందిన హెలికాప్టర్(Army helicopter Cheetah) గురువారం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బొమ్‌డిలా సమీపంలో కుప్పకూలింది. గురువారం ఉదయం 9.15 గంటలకు హెలికాప్టర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెలిగిపోయాయి.
బొమ్‌డిలాకు పశ్చిమంలోని మండలా సమీపంలో ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు గుర్తించారు. మండలా సమీపంలో చీతా హెలికాప్టర్ కూలిపోయిన సమయంలో అందులో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక మేజర్ ఉన్నారు. సింగే నుంచి మిస్సమారీకి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో హెలికాప్టర్‌లోని సైనికుల కోసం గాలింపు చేపట్టారు అధికారులు. అయితే, ఘటనా స్థలంలో లెఫ్టినెంట్ కల్నల్ వీవీబీ రెడ్డి , మేజర్ జయంత్ మృతదేహాలను గుర్తించారు.

'అరుణాచల్ ప్రదేశ్‌లోని బోమ్‌డిలా సమీపంలో విధుల్లో ఉన్న ఆర్మీ ఏవియేషన్ చీతా హెలికాప్టర్ గురువారం ఉదయం 09:15 గంటలకు ఏటీసీతో సంబంధాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. బొండిలకు పశ్చిమాన మండల సమీపంలో ఇది కూలిపోయింది. గాలింపు చర్యలు చేపట్టాయి' అని లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర రావత్, పీఆర్ఓ డిఫెన్స్ గౌహతి అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications