కశ్మీర్ లోని రంజిత్ సాగర్ ద్యామ్ లో పడిన ఆర్మీ హెలికాఫ్టర్-ప్రమాదంపై అనుమానాలు

జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో ఇవాళ ఓ ఘోర ప్రమాదం చోటు చేసకుంది. సిబ్బందితో వెళ్తున్న ఓ ఆర్మీ హెలికాఫ్టర్ ఇవాళ డ్యామ్ లో కుప్పకూలింది. దీంతో హెలికాఫ్టర్ లో ఉన్న వారంతా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారులు ఇంకా వివరాలు వెల్లడించాల్సి ఉంది.

జమ్ముకశ్మీర్ లోని కథువా జిల్లాలో ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో ఇంకా తెలియరాలేదు. స్ధానిక రంజిత్ సాగర్ డ్యామ్ లో ఈ హెలికాఫ్టర్ కుప్పకూలడంతో ఇందులో ఎంతమంది ప్రయాణించారు, వారిలో ఎంతమంది బతికున్నారనే దానిపై వివరాలు వెల్లడికాలేదు. కుప్పుకూలింది ఆర్మీ హెలికాఫ్టరే అన్న విషయం మాత్రం నిర్ధారణ అయింది.

army helicopter crash into ranjit sagar dam in jammu kashmir

జమ్మూకశ్మీర్ లోని బసోలీలో ఉన్ పుర్తూ ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన ఈ హెలికాఫ్టర్ కొద్ది సమయంలోనే పక్కనే ఉన్న రంజిత్ సాగర్ డ్యామ్ లో కుప్పకూలినట్లు తెలుస్తోంది.. ప్రమాద సమయంలో ఐదుగురు హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఆర్మీ ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రయాణ సమయంలో హెలికాఫ్టర్ లో ఆర్మీ అధికారులే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా అన్నది కూడా తెలియరాలేదు. ఆర్మీ ప్రకటన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+