పాకిస్థాన్ దుర్బుద్ధి: నియంత్రణా రేఖకు చేరువలో పాక్ నిర్మాణాలు.. భారత్ అభ్యంతరం

పాకిస్థాన్ భారతదేశంలో చొరబాటుకు కుట్రలకు తెగబడుతూనే ఉంది. భారతదేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపి పెద్ద ఎత్తున విధ్వంసాలకు ప్రయత్నాలు చేస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు మరో కొత్త వ్యూహానికి తెరతీసింది. సరిహద్దులకు చేరువలో పాకిస్తాన్ అసాధారణ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. సీక్రెట్ గా నిర్మాణాలను చేపడుతుంది.

నియంత్రణ రేఖకు 500మీటర్ల వద్ద పాక్ నిర్మాణం .. భారత్ అభ్యంతరం

ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా టీత్‌వాల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ రేంజర్లు నిర్మాణాలను చేపట్టారు. ఇక ఈ నిర్మాణాన్ని చేయవద్దని భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ వైపు 500 మీటర్ల వద్ద అక్రమ నిర్మాణం జరిగినట్లు ఆ ప్రాంతానికి చెందిన స్థానిక పోలీసు అధికారి ధృవీకరించారు. టీత్వాల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద అసాధారణ నిర్మాణాన్ని గమనించిన స్థానికులు భారత ఆర్మీ అధికారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత, సరిహద్దుకు సమీపంలో పాకిస్థాన్ రేంజర్లు అసాధారణ నిర్మాణాన్ని చేపట్టడంపై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది.

లౌడ్ స్పీకర్ లతో నిర్మాణం ఆపాలన్న భారత్ హెచ్చరిక

లౌడ్ స్పీకర్ లతో నిర్మాణం ఆపాలన్న భారత్ హెచ్చరిక


భారతదేశం పాకిస్తాన్ చేపట్టిన నిర్మాణంపై అసంతృప్తిని ప్రదర్శించింది. లౌడ్ స్పీకర్లను ఉపయోగించి పాకిస్తాన్ చేపట్టిన అసాధారణమైన నిర్మాణాన్ని ఆపాలని పాకిస్తాన్ రేంజర్స్‌ను కోరింది. దీంతో ఆ ప్రాంతంలో 'నిర్మాణం' నిలిచిపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు. వారు సరిహద్దుకు అవతలి వైపున కొంత నిర్మాణాన్ని నిర్మించడం ప్రారంభించారు, ఇది ఈ వైపు నుండి 500 మీటర్ల పరిధిలో ఉంది అని అధికారి చెప్పారు. ప్రస్తుతానికి నిర్మాణాన్ని ఆపినట్టు తెలుస్తున్నా వారు చేపట్టిన నిర్మాణంఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.

పాకిస్తాన్ నిర్మాణంతో భద్రతా సమస్య వస్తుందా అన్న సమీక్ష

పాకిస్తాన్ నిర్మాణంతో భద్రతా సమస్య వస్తుందా అన్న సమీక్ష


సాధారణ ప్రోటోకాల్‌గా, నియంత్రణ రేఖకు చేరువగా ఏ పక్షం అయినా ముందుగా తెలియజేసినట్లయితే, అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అయితే, ఏ విధమైన నిర్మాణాన్ని చేయడానికి అనుమతించబడదు అని ఆర్మీ అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే అది బంకర్ నా లేక ఏదైనా చిన్న స్థావరమా అనేది ఇంకా తెలియరాలేదని తెలుస్తుంది. ఈ నిర్మాణం కారణంగా ఏదైనా భద్రత సమస్య తలెత్తుతుందా అనేది సమీక్ష జరుపుతున్నామని భారత భద్రతా దళ అధికారి వెల్లడించారు.

భారత్ పాక్ ల ఒప్పందం ప్రకారమే నడవాలి ..

భారత్ పాక్ ల ఒప్పందం ప్రకారమే నడవాలి ..


ఏది ఏమైనా ఇటీవల కాలంలో పాకిస్తాన్ చర్యలపై అనుక్షణం నిఘా పెట్టాల్సిన పరిస్థితి భారత్ కు నెలకొంది.. భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం సమాచారం ఇవ్వకుండా నియంత్రణ రేఖ వెంబడి ఎవరూ ఎటువంటి నిర్మాణాలు చేపట్ట రాదు.అవతలి పక్షానికి ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతనే, వారి అంగీకారం తీసుకున్న తర్వాతనే ఎలాంటి నిర్మాణాలు అయినా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై ఆర్మీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు

 పాక్ డిజిటల్ కుట్రకు చెక్ పెట్టిన భారత్

పాక్ డిజిటల్ కుట్రకు చెక్ పెట్టిన భారత్

ఇదిలా ఉంటే డిజిటల్ మాధ్యమాల ద్వారా పాకిస్తాన్ భారత్ పై విషం చిమ్ముతుందని గుర్తించిన భారత్ సర్కార్ ఆయా యూట్యూబ్ చానల్స్ ను, సైట్ లను బ్లాక్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా భారత్ పై కుట్రలకు, ప్రజల్లో విద్వేషాలను సృష్టించటానికి పని చేస్తున్న పాకిస్తాన్ కుట్రను భగ్నం చేసింది. సరిహద్దుల్లో పహారా కాస్తూనే ఏ విధంగానూ భారత్ ను టచ్ చెయ్యకుండా అనుక్షణం నిఘా పెట్టి భారత్ ను పరిరక్షిస్తుంది ఇండియన్ ఆర్మీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+