పెళ్లయి 8 నెలలే: అప్పుడే ఈ లోకం విడిచిన హుస్సేన్
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌లో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో హైదరాబాద్‌కు చెందిన పైలట్ మేజర్ తాహెర్ హుస్సేన్ ఖాన్ భౌతిక కాయం హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో ఆయన స్వస్థలం సూరారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయ.
కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం గ్రామంలో నివాసముండే సర్వర్ హుస్సేన్ ఖాన్, అఫ్సర్ బేగంలకు మజర్ హుస్సేన్ ఖాన్, తాహెర్ హుస్సేన్ ఖాన్ (28), మహమూద్ హుస్సేన్ ఖాన్‌లు సంతానం. సర్వర్ హుస్సేన్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. తాహెర్ ఏడు సంవత్సరాలుగా వైమానిక బలగాల్లో మేజర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఎనిమిది నెలల కిందటే తాహెర్‌కు వివాహం జరిగింది. సికింద్రాబాదులోని ఈసిఐఎల్‌కు చెందిన నసీన్ సుల్తానాను నిరుడు మే 30వ తేదీన వివాహం చేసుకున్నాడు. పైలట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని చెప్పిన తాహిర్ ఏడేళ్లుగా ఎయిర్‌ఫోర్సులో ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్మీలో ఏవియేటర్‌గా ఉద్యోగం పొందిన తర్వాత వివాహం చేసుకున్నాడు.
జమ్మూకాశ్మీర్‌లో బుధవారం తాహెర్ నడుపుతున్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలి మృత్యువాత పడ్డాడు. తాహెర్ మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ అధికారులు సూరారంలోని తాహెర్ కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.

మేజర్ భౌతిక కాయాన్ని ప్రత్యేక విమానంలో స్వగ్రామానికి తరలించారు. తాహెర్ అంత్యక్రియలు శుక్రవారం అధికార లాంఛనాలతో శుక్రవారం జరుగుతాయి. సైనిక హెలికాప్టర్ ప్రమాదంలో డెహ్రాడూన్‌కు చెందిన మరో సైనికాధికారి గులాటి కూడా మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications