లోయలో పడిన ఆర్మీ ట్రక్, నలుగురు జవాన్లు మృతి
జమ్మూకాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పహారా కాసేందుకు వెళుతున్న ఓ సైనిక వాహనం (Army Truck) బందిపొరాలోని వులార్ వ్యూపాయింట్ వద్ద అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద ఘటనా స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. గాయపడిన జవాన్లను బందిపొరా జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్మీ సానుభూతి తెలియజేసింది. ఈ ఘటనపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
#WATCH | Jammu and Kashmir: 2 soldiers died, 3 injured after an Army vehicle veered off the road and plunged into a deep gorge near the Wular Viewpoint in the Bandipora district pic.twitter.com/lQ8MAoY9ca
— ANI (@ANI) January 4, 2025
కాగా, వారం రోజుల క్రితం పూంఛ్ జిల్లాలో ఇదే తరహా ప్రమాదం చోటు చేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం గరోవా ప్రాంతంలోని 300 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్డును అంచనావేయలేకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications