ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది, ఒక్క రోజులో 1.33 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం దరఖాస్తు
న్యూఢిల్లీ: ఏప్రిల్ 28 నుంచి 18 ఏళ్లుపైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున యువజనులు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం ఒక్కరోజే 133 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ పోర్టల్ కోవిన్(CoWIN)లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

కేవలం ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది పోర్టల్‌లో రిజిస్ట్రేషన్
కేవలం ఒక్క నిమిషంలోనే 27 లక్షల మంది కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలు, ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలు స్లాట్ల అందుబాటును బట్టి అపాయింట్‌మెంట్ కల్పిస్తాయని పేర్కొన్నాయి. దీంతో అప్పటికప్పుడు స్లాట్లను సర్దుబాటు చేయలేకపోతున్నామని, త్వరలోనే చేయడం జరుగుతుందని, ప్రజలు కొంత సమయం వేచిచూడాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, మూడోదశ వ్యాక్సినేషన్‌లో భాగంగా శనివారం (మే1) నుంచి 18 సంవత్సరాలు నిండినవారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునేవారు
https://www.cowin.gov.in/homeలో "register/sign-in" ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని కోరాయి.

ఒకేసారి భారీ సంఖ్యలో యూజర్లు లాగిన్ కావడంతో అంతరాయం
బుధవారం ఒకేసారి అత్యధిక సంఖ్యలో యూజర్లు కోవిన్ పోర్టల్‌లో వివరాలు నమోదుకు ప్రయత్నించడంతో సాయంత్రం 4 గంటలకు కొంతసమయంపాటు పనిచేయలేదు. మరోసారి ప్రయత్నించాలంటూ సందేశం వచ్చింది. కొంత సమయం తర్వాత మళ్లీ పనిచేసింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కోవిన్ పోర్టల్‌లో అంతరాయం ఏర్పడిందని, దాన్ని సరిచేసినట్లు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్యోగసేతు యాప్ ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక 18ఏళ్లు నిండినవారు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ప్రజలు తమ పేర్లు, వివరాలను నమోదు చేసుకున్నారు.
Recommended Video

మన వ్యాక్సిన్లతోపాటు త్వరలో స్పుత్నిక్ వీ..
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశంలో జనవరిలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి దశలో కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్ అయిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. రెండో దశలో ప్రాధాన్యత క్రమంలో 45ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇప్పుడు మూడో దశలో భాగంగా 18ఏళ్లు నిండినవారందరికీ వ్యాక్సినేషన్ మే 1 నుంచి ప్రారంభమవుతోంది. ఇప్పటికే భారత్‌లో తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను ఇస్తున్నారు. వీటితోపాటు రెమిడిసివిర్ కూడా అందిస్తున్నారు. ఇక రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి కూడా కేంద్రం వినియోగానికి అనుమతివ్వడంతో త్వరలోనే అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications