బ్రిజ్ భూషణ్‌ను 9లోగా అరెస్ట్ చేయండి, లేదంటే: కేంద్రానికి రైతు నేతల హెచ్చరిక

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని భారతీయ కిసాన్ యూనియన్ డిమాండ్ చేసింది. లేదంటే, దేశ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇప్పటికే రెజ్లర్ల ఆందోళనలకు రైతు సంఘాల నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే.

రెజ్లర్ల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిందే. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలి. లేదంటే అదే రోజు నుంచి రెజ్లర్లతో సహా జంతర్ మంతర్ వద్ద మేం కూడా దీక్షకు కూర్చుంటాం. దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయట్ తేల్చి చెప్పారు. అంతేగాక, రెజ్లర్లపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలన్నారు.

Arrest WFI chief by June 9: farmer leaders warn Centre, supports wrestlers protest

జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన చేసుకునేందుకు అనుమతివ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది. రెజ్లర్లకు మద్దతుగా గురువారం ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా మెమోరాండాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపింది. జంతర్‌మంతర్‌లో ఆందోళనకు అనుమతించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆమెను కోరింది.

భారత పుత్రికల గౌరవాన్ని కాపాడాలని, నెల రోజులుగా సాగుతున్న ఆందోళనకు త్వరగా ముగింపు పలకాలని విజ్ఞప్తి చేసింది. బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేసి విచారించాలని, దీంతో ఛార్జిషీట్ ను త్వరగా కోర్టులో నివేదించవచ్చని పేర్కొంది.

కాగా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారంటూ.. ఒలింపిక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించిన సాక్షి మాలిక్, వినేశ్ మాలిక్, వినేశ్ పొగట్, భజరంగ్ పూనియా, సంగీత ఫొగట్ తదిత రెజ్లర్లు గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఇటీవల నూతన పార్లమెంటుకు మార్చ్ నిర్వహించగా.. రెజ్లర్లను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విడిచిపెట్టారు. అయితే, నిరసనను తీవ్రతరం చేస్తూ తమ పతకాలను కూడా గంగా నదిలో పడేస్తామని మంగళవారం హరిద్వార్‌కు కూడా వెళ్లారు. రైతు నేతలు వారిని వారించడంతో ఆగిపోయారు. కేంద్రానికి ఐదు రోజుల డెడ్‌లైన్ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+