వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ కారణం లేకుండా అరెస్టా?: సంజయ్ రౌత్‌కు కోర్టు బెయిల్, చేతులు జోడించిన ఎంపీ

|
Google Oneindia TeluguNews

ముంబై: శివసేన (ఉద్ధవ్ థాక్రే పార్టీ) సీనియర్ నేత సంజయ్ రౌత్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. పాత్రచాల్ మనీలాండరింగ్ కేసులో
ఇరుపక్షాల వాదనలు విన్న ముంబైలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంజీ దేశ్ పాండే.. రౌత్‌కు బుధవారం బెయిల్ మంజూరు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం రౌత్ జైలు ఆర్ధర్ రోడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. తన అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు.

ఇది ఇలావుండగా, తనకు బెయిల్ మంజూరు చేసిన జడ్జీకి సంజయ్ రౌత్ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండేతో రౌత్ అన్నారు.
ఇందుకు న్యాయమూర్తి కూడా స్పందించారు.

 Arrested Illegally, For No Reason: special PMLA Court Tears Into ED Probe Against Sanjay Raut.

'ధన్యవాదాలు చెప్పాల్సిన పనిలేదు. ప్రతి విషయాన్ని మెరిట్‌పైనే నిర్ణయిస్తాం. మెరిట్ లేనప్పుడు మేము మా తీర్పును ఇవ్వము' అని న్యాయమూర్తి పాండే బదులిచ్చారు.

పాత్రా చాల్ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ "చట్టవిరుద్ధంగా" అరెస్టు చేసింది అని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తన వివరణాత్మక ఉత్తర్వుల్లో పేర్కొంది . ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే.. ప్రవీణ్ రౌత్‌ను సివిల్ వివాదం కారణంగా అరెస్టు చేయగా, సంజయ్ రౌత్‌ను "కారణం లేకుండా" అరెస్టు చేశారని చెప్పడానికి మాటలు లేవు. ఈ నిజం అబ్బురపరుస్తుంది' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వారి అరెస్టు వెనుక సివిల్ వ్యాజ్యాలే కారణమని, ఇది ముందస్తు నేరం కాదని బెంచ్ పేర్కొంది.

అంతకుముందు సంజయ్ రౌత్ విడుదలను అడ్డుకోవాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే విధించాలని ఈడీ కోరగా.. ఇరుపక్షాల వాదనలకు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.

పాత్రచాల్ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ను జులై 31న ఈడీ అరెస్ట్ చేసింది. అప్పట్నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అరెస్టుకు ముందు రౌత్ ఇంట్లో 9 గంటలపాటు సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ అధికారులు రూ. 11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 10 లక్షలు ప్రత్యేక కవర్లో ఉన్నట్లు సమాచారం.

సోదాల తర్వాత ముంబైలోని ఈడీ జోనల్ కార్యాలయంలో రౌత్ ను ఆరుగంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అతడ్ని అరెస్ట్ చేశారు.
పాత్రచాల్ భూ కుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొంతమందికి సంబంధం ఉందని ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలోనే రౌత్ కు చెందిన రూ. 11.15 కోట్ల విలువ చేసే ఆస్తులను జప్తు చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారిస్తోంది. రూ. 1,034 కోట్ల విలువైన ఈ స్కాం కేసుకు సంబంధించి రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్ ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.

English summary
'Arrested Illegally, For No Reason': special PMLA Court Tears Into ED Probe Against Sanjay Raut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X