వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Artemis: చంద్రుడి మీదకు మనుషులను పంపించేందుకు 50 ఏళ్ల తరువాత మళ్లీ ప్రయత్నాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
SLS

•ఆర్టెమిస్ -1 ‌ను ఆగస్ట్ 29న ప్రయోగించనున్నారు

•ఆర్టెమిస్-2 మిషన్ 2024లో ఉంటుందని నాసా తెలిపింది

•ఆర్టెమిస్-3 మిషన్ 2025లో ఉండొచ్చని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు


అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. చంద్రుడి మీదకు పంపించటానికి సిద్ధం చేసిన భారీ రాకెట్‌ను ఈరోజు(ఆగస్ట్ 29) ప్రయోగించనుంది.

ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ రాకెట్‌ను స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్ఎల్ఎస్) అని పిలుస్తున్నారు.

దాదాపు 100 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ను.. కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని తయారీ భవనం నుంచి భారీ ట్రక్ మీద పెట్టి ‌లాంచ్ పాడ్ 39బికి తరలించారు.

SLS

తొలుత వ్యోమగాములు, సిబ్బంది ఎవరూ రాకెట్‌లో లేకుండా ఈ రాకెట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.

ఆ తర్వాతి మిషన్లలో ఈ రాకెట్ ద్వారా అంతరిక్షయాత్రికులను చంద్రుడి మీదకు పంపించనున్నారు.

చంద్రుడి మీదకు చివరిసారిగా మనుషులు వెళ్లి వచ్చిన నాసా 'అపోలో 17' మిషన్‌కు వచ్చే డిసెంబర్‌లో 50 ఏళ్లు పూర్తవుతుంది.

అంటే.. 50 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా శ్రీకారం చుడుతోంది. దీంతో ఈ ఘట్టం చాలా కీలకంగా మారింది.

ఈసారి మూన్ మిషన్‌కు 'ఆర్టిమిస్' ప్రోగ్రామ్ అని నాసా పేరు పెట్టింది. ఆర్టిమిస్ అంటే.. గ్రీకు పురాణాల్లో ఒక దేవుడైన 'అపోలో'కు కవల సోదరి. ఆ పురాణం ప్రకారం ఆమె 'మూన్ గాడెస్' కూడా.

Mannequin

ఈ ఆర్టిమిస్ ప్రయోగాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడతామని నాసా కొన్నేళ్ల కిందటే ప్రకటించింది.

2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్షయాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.

అపోలో మిషన్ల కోసం ఉపయోగించిన 'సాటర్న్ 5' రాకెట్ల కన్నా కొత్త ఎస్‌ఎల్ఎస్ రాకెట్లకు 15 శాతం అధిక పీడనం లభిస్తుంది. ఈ అదనపు శక్తితో పాటు ఇతర ఆధునిక సాంకేతికతలు కలిసినపుడు.. ఈ వాహనం కేవలం వ్యోమగాములను మాత్రమే కాకుండా.. వారు ఎక్కువ కాలం పాటు భూమికి దూరంగా ఉండటానికి అవసరమైన పరికరాలు, సరకులను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లగలదు.

Rockets line-up

ఇక వ్యోమగాములు ఉండే క్రూ కాప్స్యూల్ సామర్థ్యం కూడా పెరిగింది. దీనిని 'ఓరియాన్' అని పిలుస్తున్నారు. 1960లు, 70ల నాటి కమాండ్ మాడ్యూళ్లతో పోలిస్తే.. ఓరియాన్ వెడల్పు మరో మీటరు పెరిగింది. దీని వెడల్పు 5 మీటర్లుగా ఉంది.

''చంద్రుడిని చూస్తూ.. మనిషి మళ్లీ చందమామ మీదకు తిరిగి వెళ్లే రోజు కోసం కలలు కనే వారందరికీ శుభవార్త. ఆ రోజు వచ్చేసింది. మనం మళ్లీ వెళుతున్నాం. ఆ ప్రయాణం, మన ప్రయాణం.. 'ఆర్టెమిస్ 1'తో మొదలవుతుంది'' అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ పేర్కొన్నారు.

''ఇప్పటి నుంచి రెండేళ్ల తర్వాత 2024లో ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా వ్యోమగాములను పంపిస్తాం. 2025లో ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా మళ్లీ మనుషులు చంద్రుడు మీద దిగుతారని మేం ఆశిస్తున్నాం'' అని ఆయన బీబీసీ న్యూస్‌తో చెప్పారు.

ఆర్టెమిస్ 3 మిషన్ ద్వారా చంద్రుడి మీద తొలి మహిళ పాదం మోపుతారని నాసా ఇప్పటికే హామీ ఇచ్చింది.

SLS graphic

ఆగస్ట్ 29న కుదరకపోతే ఏమవుతుంది

* ఆర్టిమిస్ 1‌ను ప్రయోగించటానికి సంసిద్ధం చేయటానికి పది రోజుల సమయమే ఉంది.

* ఆగస్టు 29(సోమవారం)న ప్రయోగించాలన్నది ప్రణాళిక.

* ఒకవేళ ఏవైనా సాంకేతిక సమస్యల వల్ల కానీ, ప్రతికూల వాతావరణం వల్ల కానీ ఆ రోజున రాకెట్‌ను ప్రయోగించలేకపోతే.. సెప్టెంబర్ 2వ తేదీన ప్రయోగించటానికి ప్రయత్నిస్తారు.

* ఆ రోజు కూడా వీలు కాకపోతే సెప్టెంబర్ 5న మూడోసారి ప్రయత్నిస్తారు.

* ఓరియాన్‌ను చంద్రుడి వెనుక కక్ష్యలోకి పంపించి.. అక్కడి నుంచి తిరిగి భూమి మీదకు రప్పించటం, కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ సముద్రంలోకి పడేలా చేయటం ఈ ప్రయోగంలో నాసా శాస్త్రవేత్తల లక్ష్యం.

ఓరియాన్ కాప్స్యూల్‌ హీట్‌షీల్డ్.. భూమి మీదకు తిరిగి ప్రవేశించేటపుడు ఆ వేడిని తట్టుకోగలదా లేదా అన్నది పరీక్షించటం ఈ ప్రయోగంలో ఒక ప్రధాన ఉద్దేశం.


European module

ఈ మిషన్‌లో యూరప్ కూడా కీలక భాగస్వామిగా ఉంది.

ఓరియాన్ కాప్స్యూల్‌ను అంతరిక్షంలో ముందుకు నడిపించే ప్రొపల్షన్ మాడ్యూల్‌ను యూరప్ అందిస్తోంది.

''యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అందిస్తున్న ఈ సహకారం కోసం 10కి పైగా యూరప్ దేశాలు కృషి చేస్తున్నాయి. ఇది చాలా కీలకమైన సమయం'' అని ఏరోస్పేస్ తయారీ సంస్థ ఎయిర్‌బస్ ప్రతినిధి షాయన్ క్లీవర్ పేర్కొన్నారు.

ఒకవైపు నాసా ఎస్ఎల్ఎస్‌ను అభివృద్ధి చేస్తోంటే.. అమెరికా రాకెట్ తయారీదారుడు ఎలాన్ మస్క్.. టెక్సస్‌లోని తన ఆర్ అండ్ డి ప్రాంగణంలో మరింత భారీ అంతరిక్ష వాహనాన్ని రూపొందిస్తున్నారు.

ఆయన తన భారీ రాకెట్‌కు స్టార్‌షిప్ అని పేరు పెట్టారు. భవిష్యత్తులో అర్టెమిస్ మిషన్లలో ఈ రాకెట్ కీలక పాత్ర పోషించనుంది. చంద్రుడి మీద నుంచి వ్యోమగాములను భూమికి తీసుకురావటానికి ఓరియాన్‌తో ఈ స్టార్‌షిప్ అనుసంధానమవుతుంది.

ఎస్‌ఎల్‌ఎస్ లాగానే స్టార్‌షిప్ కూడా ఇంకా తొలి ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఎస్‌ఎల్‌ఎస్‌ రాకెట్‌ను ఒక్కసారి మాత్రమే ఉపయోగించటానికి వీలుంటుంది. ఆ తర్వాత మళ్లీ కొత్త రాకెట్ అవసరమవుతుంది. కానీ స్టార్‌షిప్‌ను మళ్లీ మళ్లీ ఉపయోగించే విధంగా రూపొందిస్తున్నారు. కాబట్టి దీని నిర్వహణ ఖర్చు గణనీయంగా తక్కువగా ఉండవచ్చు.

ఎస్ఎల్ఎస్ రాకెట్ల తొలి నాలుగు మిషన్ల కోసం 400 కోట్ల డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చవుతుందని.. ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఇటీవల అంచనా వేసింది. ఇంత ఖర్చును తట్టుకోవటం సాధ్యం కాదని అభివర్ణించింది.

అయితే.. ఈ రంగంలో కాంట్రాక్టుల్లో చేసిన మార్పుల వల్ల భవిష్యత్తులో ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని నాసా చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Artemis: 50 Years Later Attempts Again to Send Men to the Moon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X