కేంద్ర బడ్జెట్ 2018: సంప్రదాయానికి అరుణ్ జైట్లీ బ్రేక్
Recommended Video

న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రతిపాదించే విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంప్రదాయానికి స్వస్తి పలుకనున్నారు. ఆయన ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్డెట్‌ను ప్రతిపాదించనున్న విషయం తెలిసిందే.
ఆయన హిందీలో బడ్జెట్ ప్రసంగం చేస్తారని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సాధారణ ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపాదించే చివరి బడ్జెట్ ఇదే. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు నేరుగా తన ప్రసంగం వెళ్లాలనే ఉద్దేశంతో హిందీలో ప్రసంగం చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అలా చేస్తే హిందీలో బడ్జెట్ ప్రసంగం చేసే స్వాతంత్య్రానంతరం తొలి భారత ఆర్థిక మంత్రి ఆయనే అవుతారు. రైతులకు బడ్జెట్‌లో ఊరట లభించే విషయాలు ఉంటాయని భావిస్తున్నారు.
సామాన్య మానవుడి కోసం ఉద్దేశించిన బడ్జెట్ అంశాలు సామాన్యులకు నేరుగా వెళ్లాలనే ఉద్దేశం వల్ల అరుణ్ జైట్లీ హిందీలో ప్రసంగించాలని అనుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications