బడ్జెట్ 2018: మాజీ ప్రధాని, కేంద్ర మంత్రి, రైతు సంఘం నాయకులు, సమస్యలకు!

బెంగళూరు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2018-19 పై పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన చివరి బడ్జేట్ ఇదే కాడంతో పలువురు ప్రముఖలు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభలో బడ్జెట్ 2018-19, రైల్వే బడ్జెట్ ను అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

మాజీ ప్రధాని దేవేగౌడ

మాజీ ప్రధాని దేవేగౌడ

భారత మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ బడ్జెట్ 2018-19 విషయంలో బెంగళూరులో స్పంధించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రైతుల సమస్యలు పరిష్కారం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ప్రధాని హెచ్.డీ. దేవేగౌడ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలతో ఆ సమస్యలు అన్నీ పరిష్కారం కావని మాజీ ప్రధాని హెచ్ డీ. దేవగౌడ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

అభివృద్దికి ఆస్కారం

అభివృద్దికి ఆస్కారం

పేదలు, మహిళలు, రైతులు, సామాన్య ప్రజల అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2018-19 తయారు చేసిందని, ఇది అందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ అని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ చెప్పారు. బెంగళూరుకు సబ్ అర్బన్ రైలు ప్రాజెక్టు మంజూరు చేసినందుకు అనంత్ కుమార్ ప్రధాని నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీతో పాటు కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

 మద్దతు ధర సరిపోదు

మద్దతు ధర సరిపోదు

రైతులకు అనుకూలమైన ధర ప్రకటించాలని, కేవలం మద్దతు ధర ప్రకటిస్తే సరిపోదని, మార్కెట్ లో ధరలు పడిపోయినప్పుడు అన్నదాతలకు కష్టాలు ఎదురౌతాయని కర్ణాటక రైతు సంఘం నాయకుడు కురబూరు శాంత కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అభినందించే బడ్జెట్

అభినందించే బడ్జెట్

భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018-19 తయారు చేశారని, దేశ ప్రజలు అందరూ ఈ బడ్జెట్ ను అభినందిస్తున్నారని కర్ణాటకలోని ధారవాడ లోక్ సభ సభ్యుడు ప్రహ్లాద్ జోషి అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పేదలకు ఈ బడ్జెట్ ఎంతో మేలు చేస్తుందని ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+