Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘోర తప్పిదం: సైనికుల మృతదేహాలు అలాగా? ట్విట్టర్ లో ఆర్మీ మాజీ అధికారి ఆక్రోశం

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత వైమానిక దళ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మరణించిన ఏడుగురు సైనికుల మృతదేహాలను ప్లాస్టిక్‌ సంచులు, అట్ట పెట్టెల్లో ఉంచడం వివాదాస్పదమైంది.

ఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో భారత వైమానిక దళ హెలికాప్టర్‌ కూలిన ఘటనలో మరణించిన ఏడుగురు సైనికుల మృతదేహాలను ప్లాస్టిక్‌ సంచులు, అట్ట పెట్టెల్లో ఉంచడం వివాదాస్పదమైంది.

మరోవైపు ఈ ఘటనపై భారత సైన్యం కూడా స్పందించింది. విధి నిర్వహణలో మరణించిన సైనికుల మృతదేహాలను స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువుల్లో ఉంచడం తప్పిదమేనని పేర్కొంది.

Arunachal chopper crash - Soldiers’ bodies sent in cardboard boxes, Army calls it an aberration

ఆ సైనికులకు పూర్తిస్థాయి సైనిక లాంఛనాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రత్యేక సంచులు, చెక్కపెట్టెలు, శవపేటికల్లో మృతదేహాలను తరలించేలా చూస్తామని తెలిపింది.
అంతకుముందు సైనికుల మృతదేహాలను ప్లాస్టిక్‌ సంచుల్లో, అట్టపెట్టెల్లో ఉంచడంపై మాజీ సైనిక ఉన్నతాధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌.ఎస్‌.పనాగ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.

''నిన్న ఏడుగురు యువకులు మాతృదేశ రక్షణ కోసం తరలివెళ్లారు. వారు తిరిగి ఇలా ఇంటికి చేరారు..'' అంటూ ఆ మృతదేహాల ఫొటోలతోపాటు ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో పలువురు ఆక్రోశం వ్యక్తంచేశారు. ఆ తర్వాత సైన్యం మరో ప్రకటన విడుదల చేసింది. పర్వత ప్రాంతంలో హెలికాప్టర్లు మోసుకెళ్లగలిగే బరువుపై పరిమితి ఉండటంతో మృతదేహ సంచులు, శవపేటికలకు బదులు స్థానికంగా అందుబాటులో ఉన్న వస్తువుల్లో మృతదేహాలను చుట్టేశారని వివరించింది.

గౌహతి సైనిక ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తయ్యాక.. మృతదేహాలను పూర్తి సైనిక లాంఛనాల నడుమ చెక్క శవపేటికల్లోకి మార్చామని, ఆ తర్వాత సదరు సైనికుల కుటుంబాలకు పంపామని వివరణ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+