హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం.. మాతృ వియోగం !!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి మోహిని మణి (84) శనివారం (మే 30) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. పరిస్థితి విషమించడంతో గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతోన్న ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న అజిత్‌.. విషయం తెలియగానే చెన్నై బయల్దేరారని సమాచారం.

మూడేళ్ల క్రితమే తండ్రి మృతి..

అజిత్ కుటుంబానికి ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. సరిగ్గా మూడేళ్ల క్రితం (2023, మార్చిలో) అజిత్ తండ్రి పి.ఎస్. సుబ్రమణ్యం కూడా వృద్ధాప్య సమస్యలు, పక్షవాతంతో బాధపడుతూ చెన్నైలోనే కన్నుమూశారు. తండ్రిని కోల్పోయిన బాధ నుండి కోలుకోకముందే, ఇప్పుడు తల్లి కూడా దూరమవడంతో అజిత్ తో పాటు ఆయన కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది. మోహినికి ముగ్గురు కుమారులు కాగా, వారిలో అజిత్ రెండో కుమారుడు.

actor-ajith-mother-mohini-mani-passed-away-due-to-health-issues-at-old-age-in-early-hours-of-may-30

ప్రైవేట్‌గా అంత్యక్రియలు.. అభిమానులకు విజ్ఞప్తి

అజిత్ కుమార్ సాధారణంగానే పబ్లిసిటీకి, హడావుడికి దూరంగా ఉంటారు. తన తల్లి అంత్యక్రియలను కూడా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలోనే నిర్వహించాలని అజిత్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి.

"మా తల్లిగారి మరణం మాకు తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, అంత్యక్రియలను కేవలం కుటుంబ సభ్యుల మధ్యే ప్రశాంతంగా కానివ్వాలని కోరుతున్నాము" అని అజిత్ కుటుంబం ఒక ప్రకటనలో అభిమానులకు, మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఇక అజిత్ తల్లి మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+