వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుణాచల్ ప్రదేశ్‌లో ఎమ్మెల్యేతో పాటు 11 మందిని హతమార్చిన మిలిటెంట్లు

|
Google Oneindia TeluguNews

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర్రంలో మిలిటెంట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన దక్షిణ కోన్సా అసెంబ్లీ సభ్యుడు తిరోంగ్ అబో మరియు ఆయన కుటుంభ సభ్యులతో సహా సెక్యురిటీ సిబ్బందితోపాటు మొత్తం పదకొండు మందిని మిలిటెంట్లు కాల్చి చంపారు. కాగా ఎమ్మెల్యే హత్యకు గురవడంతో అరుణాచల్ ముఖ్యమంత్రితోపాటు మెఘాలయ సీఎంలు తీవ్రంగా ఖండించారు.కాగా దాడులకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు, కాగా దాడులకు పాల్పడింది, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ చెందిన మిలిటెంట్ గ్రూపుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

జీపులో వెళ్తున్న ఎమ్మెల్యే వాహనం పై తీవ్రవాదుల కాల్పులు

జీపులో వెళ్తున్న ఎమ్మెల్యే వాహనం పై తీవ్రవాదుల కాల్పులు

తీవ్రావాదులు జరిపిన కాల్పుల్లో ఎమ్మెల్యేతోపాటు ఆయన కుమారుడు మరో తొమ్మిది మంది సెక్యురిటి సిబ్బంది అక్కడికక్కడే మ‌ృత్యువాత పడ్డారు. వాహనంలో ఎమ్మెల్యేతోపాటు ఆయన కుటుంభ సభ్యులు నలుగురు సెక్యురిటీ సిబ్బంది,తోపాటు ఒక పోలింగ్ ఏజెంట్‌తో పాటు మొత్తం 15మంది వెహికిల్‌లో ప్రయాణం చేస్తున్నారు. కాగా అందులో పదకొండు మంది అక్కడికక్కడే చనిపోయారు.ఇక మరో ఇద్దరు గాయపడడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి కూడ విషమంగా ఉందని రాష్ట్ర్ర డీజీపీ తెలిపారు.కాగా ఈ కాల్పుల నుండి ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారని ఆయన తెలిపాడు.కాగా మ‌ృత్యువాత పడిన ఎమ్మెల్యే కుమారుడే వెహికిల్‌ను నడుపుతున్నట్టు డీజీపీ తెలిపాడు.

బీజేపీ నేత‌‌ృత్వంలోని ఎన్‌పీపీ భాగస్వామ్య పార్టీ

బీజేపీ నేత‌‌ృత్వంలోని ఎన్‌పీపీ భాగస్వామ్య పార్టీ


కాగా మృత్యువాత పడ్డ ఎమ్మెల్యే తిరోంగ్ అబోహ ఏన్‌పీపీ తరఫున ఖోంసా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఇటివల జరిగిన ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలుపోందారు.కాగా ఆయనకు గతంలోకూడ బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం స్థానిక అసోం రైఫిల్ పోలీసులు వారికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బీజేపీ నేతృత్వంలోని నార్త్ ఈస్ట్ అలయెన్స్‌లో ఎన్‌పీపీ కూడ ఉంది.

బాధ్యులను వదిలిపెట్టం రాజ్‌నాథ్‌సింగ్

బాధ్యులను వదిలిపెట్టం రాజ్‌నాథ్‌సింగ్


కాగా జరిగిన సంఘటనను మేఘలయ సీఎం సంగ్మా తీవ్రంగా ఖండించారు. తమ పార్టీకి చెందిన వారిని తీవ్రవాదులు మట్టుబెట్టడంపై ఆయన పెద్ద ఎత్తున మండిపడ్డారు. దుర్ఘటనకు పాల్పడ్డ వారని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోపాటు ప్రధాని నరేంద్రమోడీని కోరారు. సంఘటనకు బాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా దాడపై స్పందించిన కేంద్రహోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శాంతికి విఘాతం కల్గించేందుకే తీవ్రవాదులు ఇలాంటీ ఘాతుకానికి పాల్పడ్డారని ,వారిని వదిలి పెట్టబోమని ఆయన తెలిపారు.

English summary
shocking incident being reported from Arunachal Pradesh, sitting National People's Party (NPP) MLA from Khonsa WestAssembly constituency, Tirong Aboh, and TEN others were on Tuesday killed in an attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X