అమానవీయం: నీళ్లు ఎక్కువగా వాడుతున్నాడని బూట్లు నాకించి!..
హిగియో నీళ్లు ఎక్కువగా వాడుతున్నాడని ఆగ్రహించిన హేమంత్ కుమార్ .. అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడితో ఆగక హిగియోతో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు.
బెంగుళూరు: అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థిపై దాడికి పాల్పడిన బెంగుళూరుకు చెందిన హేమంత్ కుమార్ అనే ఓ ఇంటి ఓనర్ తాజాగా బెయిల్ పై విడుదలయ్యాడు. తనపై ఫిర్యాదు చేసిన విద్యార్థిపై పలు ఆరోపణలు చేశాడు. సదరు విద్యార్థి తన పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఆరోపించాడు.
కాగా, హిగియో గుంటెయ్ అనే అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి బెంగుళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుకుంటూ హేమంత్ కుమార్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. హిగియో నీళ్లు ఎక్కువగా వాడుతున్నాడని ఆగ్రహించిన హేమంత్ కుమార్ .. అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడితో ఆగక హిగియోతో బూట్లు నాకించేందుకు ప్రయత్నించాడు.

ఈ ఘటన మార్చి 6న చోటు చేసుకోగా.. హిగియో ఫిర్యాదుపై హేమంత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈరోజు బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యాడు. జరిగిన ఘటనపై హిగియో తండ్రి స్పందించాడు. ఈ ఘటన అమానవీయమని, పోలీసులు తమకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని చెప్పాడు.












Click it and Unblock the Notifications