కేజ్రీవాల్ సహా 21 మంది ఎంఎల్ఏలపై కేసులు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కష్టకాలం మొదలయ్యిందని చెప్పాలి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. ఆ పార్టీలోని 20 మంది శాసన సభ్యులతో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీద కేసులు నమోదు చెయ్యడానికి ఢిల్లీ పోలీసు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.
రాజకీయాలకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద 6 కేసులతో పాటు సుమారు 25 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదే విధంగా నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని ఢిల్లీ మాజీ న్యాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ మీద కేసులు నమోదు అయ్యాయి.
ఆప్ శాసన సభ్యుడు సోమనాథ్ భారతీ మీద ఆయన భార్య లిపిక మిత్ర గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. అదే విధంగా ఢిల్లీలోని మొత్తం 20 మంది శాసన సభ్యుల మీద వివిధ రకాల క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని పోలీసు అధికారులు రంగం సిద్దం చేస్తున్నారు.

అక్రమ మద్యం సరఫరా చేస్తున్నారని నరేష్ బాలియన్, ప్రజల మద్య గొడవలు సృష్టించారని స్పీకర్ రామ్ నివాస్ గోయల్ మీద ఆరోపణలు ఉన్నాయి. వీరందరి మీద పోలీసు అధికారులు చార్జ్ షీట్ లు తయారు చేస్తున్నారు.
ఆప్ నేత అశుతోష్ స్పందిస్తూ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, లలిత్ మోదీ వ్యవహరం పక్కదోవపట్టించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి తమ పార్టీ నేతల మీద అనవసరంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షలకు దిగుతుందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications