బీజేపీ లక్ష్యం ఆప్ అంతం - కేజ్రీవాల్, ఉద్రిక్తత..!!
ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీకి ఆప్ భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ ఝాడును ప్రారంభించిందని అన్నారు. ఆప్ నేతల ఆరెస్టులకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ముందు తమ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు144 సెక్షన్ అమలుచేసారు.
కేజ్రీవాల్ ఆగ్రహం
ఆప్‌ను అంతం చేయాలన్న ఉద్దేశంతో ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు బిజెపి ఆపరేష్ ఝాడు కార్యక్రమాన్ని చేపట్టిందని బిజెపి, ప్రధానమంత్రి నరేంద్ర మోడిలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా ... బిజెపి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు కారణమూంది. ఆమ్‌ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని నిర్ణయించుకున్నారని విమర్శించారు.

మోదీ లక్ష్యం అదే
ఆప్ ఎదుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారు. పార్టీ చాలా వేగంగా అభివృద్ది చెందిందన్నారు. ఆప్‌ను అణిచివేసేందుకే ఆపరేషన్ ఝాడును బీజేపీ ప్రారంభించిందిని ఆరోపించారు. రానున్న కాలంలో ఆప్ నేతలను అరెస్ట్ చేస్తారన్నారు. బీజేపీకి ఆప్ పెద్ద సవాల్‌గా మారుకుండా ఉండేందుకు భవిష్యత్తులో మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయాన్ని మూసి వేసి వీధుల్లోకి తీసుకొస్తారని వివరించారు. మున్ముందు మనకు పెద్ద సవాళ్లు ఉంటాయని చెప్పిన కేజ్రీవాల్... వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అప్రమత్తంగా ఉండాలి
ఆప్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారని.. ఆప్‌ను అంతం చేయాలని భావిస్తోన్న బిజెపి.. తనకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ ఝాడు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని అన్నారు. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమేనని కేజ్రీవాల్ ఆరోపించారు. ఆమ్‌ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఆప్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారని.. ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ భావిస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
-
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications