అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్; బీజేపీ కార్యాలయాల ముందు ఆప్ ఆందోళనలకు పిలుపు; లేటెస్ట్ అప్డేట్స్!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. నిన్న రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బృందం సీఎం నివాసానికి చేరుకున్న తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి, విచారిస్తుంది ఈడీ.
తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. దేశంలోని సీఎం హోదాలో అరెస్ట్ అయిన తొలి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ కావడం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొమ్మిది సార్లు సమన్లు జారీ చేసినా ఆయనకు ఒకసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.

నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ దీనిపైన మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ప్రజాస్వామ్యం హత్య గావించబడిందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇది నియంతృత్వానికి ఉదాహరణ అని, మాట్లాడే గొంతుకలను అణచివేసే క్రమంలోఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయగలిగిన వాళ్లు, దేశంలోని ప్రతి చిన్నారిని కూడా అరెస్ట్ చేయగలరు అంటూ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు ఈరోజు పోరాటం మొదలైందని అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక భావజాలం అంటూ పేర్కొన్న ఢిల్లీ మంత్రి దేశంలో ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి బిజెపి కావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులను టార్గెట్ చేస్తుందంటూ విమర్శించారు. ప్రతిపక్ష నాయకులను ఒక్కొక్కరిగా అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. ఈరోజు బిజెపి చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని పేర్కొన్న ఆప్ మంత్రి యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ ప్రజలకు, దేశ ప్రజలకు తను చేయదలుచుకున్న విజ్ఞప్తి ఒకటేనని చెప్పిన ఆయన నేడు దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని, బిజెపి కుట్రపూరిత చర్యలలో భాగంగానే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. నేడు ఉదయం 10 గంటలకు ప్రధాన కార్యాలయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం అవుతుందని, తాజా పరిణామాలతో పార్టీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications