Arvind Kejriwal : ఇండియాతో బంధంపై తేల్చేసిన అరవింద్ కేజ్రివాల్...!
పంజాబ్ డ్రగ్స్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ సింగ్ ఖైరాను ఆప్ ప్రభుత్వం అరెస్టు చేసింది. దీంతో కాంగ్రెస్, ఆప్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఓవైపు జాతీయ స్ధాయిలో ఇండియా కూటమిలో సభ్యులుగా ఉన్న ఈ రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం చిచ్చు రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై తన స్టాండ్ ఏంటో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తేల్చిచెప్పేశారు.
పంజాబ్‌లో ఎమ్మెల్యే సుఖ్‌పాల్ ఖైరాను డ్రగ్స్‌పై అరెస్టు చేయడంపై తమ పార్టీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విభేదించుకుంటున్నప్పటికీ ఆప్.. ఇండియా కూటమికి పూర్తిగా కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఇవాళ తేల్చిచెప్పారు. ఆప్ ఇండియా కూటమికి కట్టుబడి ఉంది, ఇండియా కూటమి నుంచి ఆప్ విడిపోదని కేజ్రివాల్ క్లారిటీ ఇచ్చారు.

పంజాబ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టుపై స్పందిస్తూ.. డ్రగ్స్‌పై యుద్ధానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కేజ్రివాల్ వెల్లడించారు. పంజాబ్ పోలీసులు నిన్న ఓ కాంగ్రెస్ నాయకుడిని అరెస్టు చేశారని తనకు తెలిసిందని, తన దగ్గర ఆ వివరాలు లేవని, మీరు పోలీసుల నుండి తీసుకోవచ్చని మీడియాతో వ్యాఖ్యానించారు. తాము డ్రగ్స్‌పై యుద్ధం చేస్తున్నామని, తాను విడిగా ఏ కేసుపైనా మాట్లాడనని, డ్రగ్స్ అంతానికి మాత్రం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
మరోవైపు ఇవాళ పంజాబ్ కాంగ్రెస్ నేతలు తమ హైకమాండ్‌తో ఆప్ సీనియర్ నేతల్ని టార్గెట్ చేస్తోందని ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రులు సాధు సింగ్ ధరమ్‌సోత్, భరత్ భూషణ్ అషు, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఓపీ సోనీల అరెస్టులను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న సుఖ్‌పాల్ సింగ్ ఖైరా కంటే ముందు ఈ ముగ్గురూ అరెస్టయ్యారు. దీనిపై కాంగ్రెస్ ఛీఫ్ మల్లిఖార్జున ఖర్గే స్పందిస్తూ.. తమకు ఎవరైనా అన్యాయం చేస్తే, సహించేది లేదన్నారు. పంజాబ్ వివరాలు తెప్పించుకుంటున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications