Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం హోదాలో అరెస్టయిన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్!

న్యూడిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న తొలి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రికార్డుల్లోకెక్కారు.

అయితే, ఇప్పటి వరకు చాలా మంది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అనంతరం అరెస్టయ్యారు. ఆ జాబితాను పరిశీలించినట్లయితే లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, ఓం ప్రకాశ్ చౌతాలా, మధు కోడా, ఇటీవల హేమంత్ సోరెన్ వంటి నేతలు మాజీ సీఎంలుగా అరెస్టయ్యారు. అయితే, అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

Arvind Kejriwal India s First Incumbent Chief Minister To Be Arrested

కాగా, తాజాగా, మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. సుమారు రెండు గంటలపాటు ఆయన నివాసంలోనే విచారించిన ఈడీ అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోన్‌ను సీజ్ చేశారు.

తొలుత దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన తర్వాత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కేజ్రీవాల్‌ను దాదాపు రెండు గంటలపాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ అరెస్టుపై సమాచారాన్ని ఆయన భార్యకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు గల కారణాలను కూడా పేర్కొన్నారు. మరోవైపు, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఢిల్లీ మంత్రులు, ఆప్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం రాత్రే విచారించాలని కోరారు. కానీ, శుక్రవారం ఉదయం ఈ అంశంపై విచారించే అవకాశం ఉంది.

మరోవైపు, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీతోపాటు విపక్ష పార్టీల నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని చివరకు ముఖ్యమంత్రులను కూడా అరెస్టు చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇండియా కూటమిని బలహీనపర్చేందుకే ఈ అరెస్టులని మండిపడ్డారు. మరోవైపు, ప్రియాంక గాంధీ కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+