వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Arvind Kejriwal: కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

భారతీయ కరెన్సీ మీద లక్ష్మీ దేవి, గణేశ్ బొమ్మలు ముద్రించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు.

అంతేకాదు 'లక్ష్మీ దేవి, గణేశ్ బొమ్మలు ఉంటే దేశం వృద్ధి చెందుతుంది' అని కూడా ఆయన సలహా ఇచ్చారు.

ఈమేరకు కేంద్రానికి ఒక లేఖ కూడా రాస్తానని కూడా అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

అరవింద్ కేజ్రీవాల్ ఆ మాటలు అలా అన్నారో లేదో ఇలా బీజేపీ ఆయన వ్యాఖ్యలను విమర్శించింది.

'అయోధ్య రామమందిరాన్ని సందర్శించడానికి నిరాకరించిన' అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు ఇప్పుడు ఎలా మారిపోయాయో చూడండని బీజేపీ నేత సంబిత్ పాత్రా అన్నారు.

'అయోధ్య రామమందిరాన్ని సందర్శించడానికి నిరాకరించింది ఆయనే. అక్కడ పూజలు చేసినా వాటిని దేవుడు అంగీకరించడు అన్నది ఆయనే. కశ్మీరీ పండితుల వలసలు అబద్ధమన్నది ఆ వ్యక్తే. ఇప్పుడు ఆయన రాజకీయాలు యు-టర్న్ తీసుకున్నాయి' అని ఆయన ఆరోపించారు.

https://twitter.com/ANI/status/1585165295513374720

అరవింద్ కేజ్రీవాల్ మీద బీజేపీ చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతీషీ స్పందించారు.

''కేజ్రీవాల్ అంటే మీకు ఇష్టం లేక పోవచ్చు. ఆయనను మీరు వ్యతిరేకించవచ్చు. కానీ ఈ ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకించకండి. ఇది 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది’’ అంటూ అతీషీ అన్నారు.

https://twitter.com/AAPDelhi/status/1585179545900318721

రాజకీయ నాయకుల విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో మీమ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి.

'చెప్పండి ఎవరు బాగా చెప్పారు?' అంటూ Rangroot అనే యూజర్ ఈ కింది ఫొటోను ట్వీట్ చేశారు.

https://twitter.com/RangrootPB10/status/1585168089293152258

'కొత్త కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, గణేశ్ బొమ్మలను ముద్రించాలని ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీని ట్రాప్ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నించారు' అంటూ Gajender అనే యూజర్ పోస్ట్ చేశారు.

https://twitter.com/gajender00/status/1585205035755253760

కరెన్సీ మీద సచిన్, ధోని, కోహ్లి ఫొటోలను కూడా ముద్రించాలంటూ మరికొందరు ట్వీట్ చేశారు.

https://twitter.com/United_Emerald/status/1585196301649870848

అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ కొందరు సమర్థిస్తూ కొందరు పోస్టులు చేస్తున్నారు.

గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ఇలా మాట్లాడుతున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. 'బీజేపీ హిందుత్వాన్ని' ఎదుర్కొనేందుకు అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి మార్గాన్ని ఎంచుకొన్నారని మరికొందరు అన్నారు.

https://twitter.com/himansshhi/status/1585198967746617345

గుజరాత్ ఎన్నికలు వస్తున్నందున అరవింద్ కేజ్రీవాల్ హిందుత్వ కార్డ్ ప్లే చేస్తున్నారు' అని Jahangir Khan అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/jahangirkhn90/status/1585201696929906689

'జాతీయ రాజకీయాలను మారుస్తానంటూ వచ్చిన అరవింద్ కేజ్రీవాల్, ఇటువంటి సలహా ఇవ్వడాన్ని నమ్మలేక పోతున్నా. ఆయన ఎప్పుడూ ఇంతే అయి ఉండాలి లేదా రాజకీయాలు ఆయనను మార్చి ఉండాలి. ఏది ఏమైనప్పటికీ అది అర్థం లేని ప్రతిపాదన' అని Varun Verma అనే యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/iVarunVerma/status/1585184364995833856

కొందరు అరవింద్ కేజ్రీవాల్‌ను సమర్థిస్తున్నారు.

''సహజంగా అరవింద్ కేజ్రీవాల్ నాస్తికుడు. ఐఐటీ వంటి ఉన్నత సంస్థల్లో చదువుకున్న వ్యక్తి. దేశంలో మెజారిటీ ఓటర్లు మతాన్ని నమ్మేవారు కాబట్టి ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది. మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఎవరూ గెలవలేరు. అరవింద్ కేజ్రీవాల్‌ను మంచి లీడర్ అనుకోవచ్చు’’ అని Yeshpal Singh Tomer అనే యూజర్ అన్నారు.

https://twitter.com/ypstomer/status/1585201319681617923

అరవింద్ కేజ్రీవాల్‌ను సమర్థిస్తున్నానంటూ SM అనే యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/sm_1179/status/1585203032064921600

భారత కరెన్సీ

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కరెన్సీ నోట్ల మీద ఎలాంటి బొమ్మలు ముద్రించారో ఒకసారి చూద్దాం.

కరెన్సీ నోట్ల మీద ఫొటోలను ఎవరు ముద్రిస్తారు?

  • అయితే కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మలు ముద్రించాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
  • ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు చేసే సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.

కాబట్టి లక్ష్మీ దేవి, వినాయకుల బొమ్మలను ముద్రించాలా లేదా అనేది కేంద్రం ప్రభుత్వం నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.

తొలుత మూడు సింహాలు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1949లో తొలిసారి ఒక రూపాయి నోటును విడుదల చేశారు.

అంతకు ముందు బ్రిటిష్ ఇండియా కరెన్సీ మీద కింగ్ జార్జ్ ఫొటో ఉండేది. దాని స్థానంలో అశోకుని సార్‌నాథ్ స్థూపంలోని మూడు సింహాల బొమ్మను ముద్రించారు.

  • 1951 నుంచి కరెన్సీ నోటును ఎవరు జారీ చేశారు? దాని విలువ ఎంత? గ్యారంటీ క్లాజ్ వంటివి హిందీలో ముద్రించడం ప్రారంభించారు.
  • 1954లో రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను ముద్రించారు.
  • అశోక స్తూపం వాటర్ మార్క్‌గా ఉన్న రూ.10 నోట్లను 1967-92 మధ్య ముద్రించారు. రూ.20 నోటును 1972-75 మధ్య తీసుకొచ్చారు. రూ.50 నోటును 1975-81 మధ్య విడుదల చేశారు. రూ.100 నోటును 1967-79 మధ్య ముద్రించారు.
  • 1967-79 మధ్య ముద్రించిన నోట్ల మీద సైన్స్, టెక్నాలజీ, ప్రగతి, భారతీయ కళలకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు.
  • 1970లో తొలిసారి 'సత్యమేవ జయతే' అనే నినాదం ఉన్న నోట్లను తీసుకొచ్చారు.

మూడు సింహాల అశోక స్తూపం వాటర్‌మార్క్‌తో పాటు మహాత్మ గాంధీ ఫొటో ఉన్న రూ.500 నోటును 1987లో ముద్రించారు.

మహాత్మ గాంధీ సిరీస్

  • 1996లో మహాత్మా గాంధీ సిరీస్ నోట్లను విడుదల చేశారు.
  • ఈ సరీస్‌లో మూడు సింహాలు ఉన్న అశోకుని స్తూపానికి బదులు మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించారు. గాంధీ ఫొటోనే వాటర్ మార్క్‌గా కూడా ఉంచారు.
  • నాడు రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.500, రూ.1,000 నోట్లను తీసుకొచ్చారు.
  • దొంగ నోట్లను అరికట్టడంలో భాగంగా కొత్త భద్రతాపరమైన ఫీచర్లతో 2005లో మహాత్మా గాంధీ కొత్త సిరీస్ నోట్లను తీసుకొచ్చారు.

రూ.1,000 నోటును తొలిసారి 2000 సంవత్సరం అక్టోబరు 9న విడుదల చేశారు.

మంగళయాన్

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత 2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

ఆ తరువాత రూ.2,000 నోటుతో పాటు కొత్త రూ.500 రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను విడుదల చేశారు.

గాంధీ బొమ్మతో పాటు భారత పార్లమెంటు, ఎర్రకోట, మంగళయాన్ వంటి చిత్రాలను వాటిపై ముద్రించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Arvind Kejriwal: Is it possible to print Photos of Goddess Lakshmi and Ganesha on currency notes, what do netizens say about Kejriwal's comments?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X