రాహుల్ కౌంటర్‌కు కేజ్రీవాల్ రియాక్షన్.. 20 రోజులు ఆగాలని సూచన

పంజాబ్ పోరు రసవత్తరంగా మారింది. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, ఆప్ మధ్య ఉండనుంది. రాహుల్ గాంధీ చేసిన ఉగ్రవాది కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బుధవారం మొహాలీలో పర్యటించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 20 రోజుల్లో ఎవరేంటో రాహుల్ గాంధీ తెలుసుకుంటారని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

గత ఐదేళ్లుగా పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసి స్థానిక వ్యాపారులు భయపడిపోతున్నారని చెప్పారు. వ్యాపారాలు మూసుకునే విధంగా కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మేము అధికారంలోకి వచ్చి "పచ్చ రాజ్"ను అణిచివేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాదులతో పోల్చుతూ రాహుల్ గాంధీ చురకలు అంటించారు. పంజాబ్‌లోని బర్నాలాలో జరిగిన బహిరంగ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. 'జాడూ' అధినేత ఉగ్రవాదుల ఇళ్లలోనూ కనిపిస్తారని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఉగ్రవాది ఇంటిలో కాంగ్రెస్ నేతలు కనిపించరన్న రాహుల్.. కానీ 'జాడూ'కు చెందిన అతిపెద్ద నాయకుడు మాత్రం ఉగ్రవాది ఇంట్లో కూడా కనిపిస్తాడని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పంజాబ్‌ లో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

 arvind kejriwal reacts about rahul gandhi comments

2017 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ మాజీ ఉగ్రవాది ఇంట్లో ఓ రాత్రి బస చేశారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ ఎత్తిచూపారు. ఇలాంటి నేతలను నమ్ముకుంటే, టెర్రరిస్టులతో మెతక వైఖరి అవలంబించి జాతీయ భద్రతను తాకట్టు పెడతారని విమర్శించారు. ఒక్క చాన్స్ అంటున్నారని, కానీ ఆప్ వాళ్లకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని అన్నారు.

Recommended Video

    UP Elections 2022:PM Modi రిక్వెస్ట్ ఓటర్లను ఆకట్టుకునేందుకు | Yogi Adityanath | Oneindia Telugu

    పంజాబ్ లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లున్నాయి. ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. కానీ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది. మార్చి 10న ఫలితాలు రానున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+