పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు: కేజ్రీవాల్‌కు 'బావమరిది' షాక్
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. తన సొంత బావమరిది సురేందర్ కుమార్ బన్సాల్ .
న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేక ఉద్యమంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు కొత్త చిక్కు వచ్చి పడింది. తన సొంత బావమరిది సురేందర్ కుమార్ బన్సాల్ అవినీతికి పాల్పడ్డారంటూ ఓ ఎన్జీవో పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై ఢిల్లీ పోలీసులు ఫిర్యాదు ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగం ఈ విచారణ ప్రారంభించింది. కేజ్రీవాల్ బావమరిది బన్సల్ నకిలీ బిల్లులు, ఇన్వాయిస్‌లతో ప్రజా పనుల శాఖ నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

ఓ స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు ఈ ఫిర్యాదు చేశారు. ఆధారాలతో రావాలని అధికారులు ఆయనకు సూచించారు. డమ్మీ కంపెనీల పేర్లతో ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలో డ్రెయిన్ల నిర్మాణ కాంట్రాక్టును బన్సల్ చేజిక్కించుకున్నారు.
కేజ్రీవాల్ సాయం చేయడం వల్లే ఆయన బావమరిదికి ఈ కాంట్రాక్టు వచ్చిందని ఆరోపిస్తున్నారు. స్వచ్చంధ సంస్థ నిర్వాహకుడు వేసిన పిటిషన్ మీద విచారణ జరపాలా వద్దా అనే విషయమై విచారణను వారం రోజుల పాటు వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications