షాక్: స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రూ.50 కోట్ల కుంభకోణం కేసులో ఢిల్లీ ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేందర్ కుమార్‌ను సిబిఐ అరెస్టు చేసింది. కంప్యూటర్ల కొనుగోలులో రూ.50 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సోమవారం ఆ అరెస్టు జరిగింది.

ఆ కుంభకోణంలో కీలక పాత్రధారి రాజేందర్ కుమార్ అనే ఆరోపణలు వచ్చాయి. టెండర్లను ఆహ్వానించకుండా కంపెనీలను స్థాపించడదానికి వర్క్ కాంట్రాక్ట్‌లు ఇచ్చాడనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దాని వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లింది.

Arvind Kejriwal's Top Officer Arrested By CBI In 50 Crore Scam

ఈ కుంభకోణం 2006కు సంబంధించింది. ఐటి సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్‌లను అందించడానికి ఎండీవరస్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే కంపెనీని రాజేందర్ కుమార్ స్థాపించాడని ఆరోపణలున్నాయి. టెండర్లతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం పనులను ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆ కంపెనీ పొందింది.

రాజేందర్ కుమార్ 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఆయన ఫిబ్రవరిలో నియమితులయ్యారు. రెండోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆయన పదవిలో నియమితులయ్యారు. కేజ్రీవాల్‌తో పాటు రాజేందర్ కుమార్ ఐఐటిలో చదివినట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi government's Principal secretary Rajender Kumar was arrested today on a 50 crore corruption case involving purchase of computers. Four others were arrested along with him, but the Central Bureau of Investigation, which was investigating the case, say Mr Kumar is the kingpin of the scam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి