Arvind Kejriwal..జైల్లో కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడిపండ్లే: ఈడీ చీప్ అభియోగాలు
జైలులో అరవింద్ కేజ్రీవాల్ విపరీతంగా షుగర్ పెరిగే ఆహార పదార్థాలు తింటున్నారని నిన్న ఆయన ఆరోగ్యం విషయంలో కోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. నేడు కూడా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ధర్మాసనం ముందు అరవింద్ కేజ్రీవాల్ ఆహారానికి సంబంధించిన వివరాలను ఆయన అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వెల్లడించారు.
కేజ్రీవాల్ తిన్నది మూడు మామిడి పండ్లే
అరవింద్ కేజ్రీవాల్ జైల్లో 48 సార్లు భోజనం చేస్తే కేవలం మూడు సార్లు మాత్రమే ఇంట్లో వండిన ఆహారంలో మామిడి పండ్లు తిన్నారని స్పష్టం చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనకు ఇంటి నుంచి మూడుసార్లు మామిడిపండ్లు వచ్చాయని, కానీ ఈ డి తన షుగర్ లెవెల్స్ పెంచుకోవడానికి స్వీట్లు, మామిడి పండ్లు, ఆలు తింటున్నారని వాదిస్తుంది అని చెబుతూ, వారి వాదనలకు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈడీ ఆరోపణలు చాలా చీప్ గా ఉన్నాయి
ఆలూ కూడా ప్రసాదంగా ఒకేసారి తాను తిన్నానని కేజ్రీవాల్ తరపున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. టీ తాగినట్టు చెప్పారని, టీ షుగర్ లేకుండానే తాగానని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్ కు డయాబెటిస్ ఉంది కాబట్టి తీపిపదార్థాలు తీసుకోవడం లేదని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వెల్లడించారు. ఈడీ చేస్తున్న ఆరోపణలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని, చాలా చీప్ గా ఉన్నాయని ఇందులో రాజకీయ కోణం కనిపిస్తోందని అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు.
స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు వినలేదు కనలేదు
జైల్లో ఉన్నంత మాత్రాన నేరస్థుడు కాదని, ఖైదీ అయితే హక్కులు ఉండవా అంటూ వాదించారు. కేజ్రీవాల్ ఏమైనా హార్డ్ కోర్ నేరస్తుడా? లేక గ్యాంగ్ స్టర్ నా? అంటూ వాదన వినిపించిన న్యాయవాది వైద్యుడితో వర్చువల్ గా 15 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతి ఉండదా? స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటిది ఎప్పుడు వినలేదు కనలేదని పేర్కొన్నారు.
ఈడీ వాదన ఇలా
ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ కూడా తన వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ కు సూచించిన డైట్ లో షుగర్ పెంచే ఆహారం లేదని, ఆయన పరిమిత ఆహారం తీసుకోవాలని ఉందన్నారు. ఇంతకు ముందు ఇన్సులిన్ తీసుకున్నానని, ఇప్పుడు మానివేసినట్టు ఆయనే స్వయంగా చెప్పారని కోర్టుకు తెలిపారు.
కోర్టు తీర్పు రేపటికి వాయిదా
దీంతో కోర్టు మళ్ళీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులను డైట్ చార్ట్ ప్రకారమే ఫుడ్ ఇచ్చారా అని ప్రశ్నించి, అలా కనిపించలేదని అభిప్రాయపడింది. జైల్లో కేజ్రీవాల్ కు అన్ని వైద్య సదుపాయాలూ కల్పిస్తున్నామని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రేపటికి తీర్పును వాయిదా వేసింది. రేపటిలోగా జైలు అధికారులను, ఈడీని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications