పార్టీకి నిధుల్లేవ్, సాయం చేయండి: ప్రజలకు కేజ్రీ

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు టెలివిజన్‌లో బహిరంగ విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద నిధులు నిండుకున్నాయని, పార్టీని నడపాలంటే నిధులు అవసరమని, ప్రజలు సాయం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ రూ. 10 ఇస్తే చాలని అన్నారు.

బిగ్‌షాట్స్ వద్ద నుంచి రహస్యంగా తామెన్నడూ డబ్బులు తీసుకోలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత మా వద్ద ఉన్న డబ్బంతా అయిపోందని, పార్టీ రోజువారీ కార్యక్రమాలకు నిధులు అవసరమని కోరారు. పార్టీకి విరాళాలు ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు.

Arvind Kejriwal Says AAP is Broke, Wants Public to Chip In

ప్రస్తుతం పార్టీ రోజువారీ కార్యకలాపాలకు కూడా డబ్బుల్లేవని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. 'ఈ విధంగా విరాళాలు అడుగుతున్నందుకు మీరు అనొచ్చు, ఇతనేం ముఖ్యమంత్రి అని. తప్పుడు మార్గంలో నిధులు అందుకునే వీలున్నా, మేం అలాంటి వాళ్లం కాదు. ప్రజలే మాకు నిధులందిస్తున్నారు. అవినీతి సొమ్ముకు ఎప్పుడూ ఆశపడలేదు. ప్రతి రూపాయికి రికార్డులు చూపించాం. నిజాయితీ రాజకీయాలు చేసేందుకు మీరిచ్చే రూ. 10 ఎంతగానో ఉపయోగపడుతుంది' అని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+