వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పనగారియా రాజీనామా

నీతి అయోగ్ ఉపాధ్యక్షులు అరవింద్ పనగారియా తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి విద్యా రంగంలోకి వెళ్లడానికే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నీతి అయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా తన పదవికి రాజీనామా చేశారు. తిరిగి విద్యా రంగంలోకి వెళ్లడానికే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు ఆయన కొనసాగనున్నారు.

అరవింద్ పనగారియా ఇండియన్ - అమెరికన్ ఆర్థికవేత్త. కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. అంతకుముందు ఆయన ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పని చేశారు.

Arvind Panagariya quits as Niti Aayog vice chairman

అంతకుముందు ఆయన కాలేజ్ పార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో ఎనకామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేశారు.

ప్రపంచ బ్యాంకుకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెండ్ (UNCTAD)లకు కూడా పని చేశారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి పట్టా పొందారు.

English summary
Arvind Panagariya has resigned as the vice chairman of the Niti Aayog. He says that he wants to return to academia. He will serve the Niti Aayog till the end of August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X