వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Aryan Khan: షారుక్ ఖాన్ కొడుకుతో సెల్ఫీలు, లొంగిపోతానని కిరణ్ గోసావి స్టేట్ మెంట్, కథ క్లైమాక్స్!

|
Google Oneindia TeluguNews

ముంబాయి/ లక్నో: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముంబాయి తీరంలో విలాసవంతమైన క్రూయిజ్ షిప్ లో హైటెక్ ప్రోఫైల్ యువకుల డ్రగ్స్ పార్టీ కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, అతని ఫ్రెండ్స్ ఇప్పటికే జైలుపాలైనారు. ఆ రోజు క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ తో పాటు సెల్ఫీలు, వీడియోలు తీసుకుని విడుదల చేసిన వ్యక్తి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు ఇదే కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని, మహారాష్ట్ర పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, వేరే రాష్ట్రంలోని పోలీసుల ముందు లొంగిపోతానని ప్రముఖ జాతీయ టీవీ చానల్ కు చెప్పడం కలకలం రేపింది.

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు అయిన రోజు అదే షిప్ లో అతనితో పాటు సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి మాయం అయిపోయాడు. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తిని పట్టుకోవడానికి ఎన్ సీబీ అధికారులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇలాంటి సమయంలో ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి లొంగిపోతానని స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది.

ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న వ్యక్తి ఈ కేసు క్లోజ్ చెయ్యడానికి ఎన్ సీబీ అధికారులకు రూ. 25 కోట్లు లంచం ఇవ్వాలని పలువురికి చెప్పాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ రోజు షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో అతని తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావి లొంగిపోతానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Illegal affair: ప్రియుడిని ఇంట్లో పెట్టుకున్న అత్త, బెడ్ రూమ్ లో దూరి పొడిచిపారేసిన అల్లుడు!Illegal affair: ప్రియుడిని ఇంట్లో పెట్టుకున్న అత్త, బెడ్ రూమ్ లో దూరి పొడిచిపారేసిన అల్లుడు!

ఆర్యన్ ఖాన్ అండ్ కో

ఆర్యన్ ఖాన్ అండ్ కో

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ రోజు క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ తో పాటు సెల్ఫీలు, వీడియోలు తీసుకుని విడుదల చేసిన కిరణ్ గోసావి హాట్ టాపిక్ అయ్యాడు.

ఇప్పుడు ఇదే కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావి తనకు ప్రాణహాని ఉందని, మహారాష్ట్ర పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, ఉత్తరప్రదేశ్ లోని లక్నోపోలీసుల ముందు లొంగిపోతానని చెప్పాడు.

ఆ రోజు అదే క్రూయిజ్ షిప్ లో కిరణ్ గోసావి

ఆ రోజు అదే క్రూయిజ్ షిప్ లో కిరణ్ గోసావి

ముంబాయి తీరంలోని క్రూయిజ్ షిప్ లో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు అతని స్నేహితులు డ్రగ్స్ పార్టీ నిర్వహించారని ఆరోపిస్తూ ఎన్ సీబీ అధికారులు వారిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ రోజు అదే షిప్ లో ఆర్యన్ ఖాన్ తో పాటు కిరణ్ గోసావి కూడా ఉన్నాడు.

ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్న కిరణ్ గోసావి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసిన తరువాత ఉన్నట్లుండి మాయం అయిపోయాడు.

ఎలా తప్పించుకున్నాడు?

ఎలా తప్పించుకున్నాడు?

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు అయిన తరువాత అతనితో పాటు సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావి మాయం కావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావిని పట్టుకోవడానికి ఎన్ సీబీ అధికారులు ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

రూ. 25 కోట్ల లంచం డీల్ మాట్లాడింది ఇతనేనా?

రూ. 25 కోట్ల లంచం డీల్ మాట్లాడింది ఇతనేనా?

ఎన్ సీబీ అధికారులు లుక్ ఔట్ నోలీసులు జారీ చేసిన మయంలో ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావి లొంగిపోతానని స్టేట్ మెంట్ ఇవ్వడం కలకలం రేపింది. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకున్న కిరణ్ గోసావి ఈ కేసు క్లోజ్ చెయ్యడానికి ఎన్ సీబీ అధికారులకు రూ. 25 కోట్లు లంచం ఇస్తానని, ఇంతటితో ఈ కేసు రాద్దాంతం ముగిసిపోతుందని పలువురికి చెప్పాడని ఆరోపణలు ఉన్నాయి.

నేను ఎందుకు లంచం అడుగుతాను ?

నేను ఎందుకు లంచం అడుగుతాను ?

ఎన్ సీబీ అధికారులు నన్ను అడ్డం పెట్టుకుని లంచం డిమాండ్ చేశారు అని చెప్పడం నిజం కాదని కిరణ్ గోసావి అంటున్నారు. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు, వీడియో తీసుకున్న కిరణ్ గోసావిని అడ్డం పెట్టుకుని ఎన్ సీబీ అధికారి సమీర్ వాంఖేడ్ రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేశారని ఇప్పటికే ప్రభాకర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసింది. ప్రభాకర్ చేస్తున్న ఆరోపణలను కిరణ్ గోసావి ఖండించారు.

రెండుసార్లు ఉన్నాడు కానీ?

రెండుసార్లు ఉన్నాడు కానీ?

క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేసిన సమయంలో, తరువాత ఎన్ సీబీ కార్యాలయంలో ఆర్యన్ ఖాన్ ను విచారణ చేసిన సమయంలో కేపీ. కిరణ్ గోసావి అక్కడే ఉన్నాడని, తరువాత అతను మాయం అయిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ తో సెల్ఫీలు తీసుకోవడం వెనుక కిరణ్ గోసావికి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి ? అనే విషయం మాత్రం అంతు చిక్కడం లేదు.

Recommended Video

డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయడానికి మరో ప్రజా ఉద్యమం రావాలి!!
 ముంబాయిలో తనకు ప్రాణహాని ఉంది

ముంబాయిలో తనకు ప్రాణహాని ఉంది

ముంబాయిలో లొంగిపోదామని అనుకుంటే తనకు అక్కడ ప్రాణహాని ఉందని, అందుకే లక్నోలో పోలీసుల ముందు లొంగిపోవాలని అనుకుంటున్నానని కిరణ్ గోసావి ఎన్ డీ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో చెప్పాడు. మొత్తం మీద కిరణ్ గోసావి పోలీసుల ముందు స్టేట్ మెంట్ ఇస్తే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో కిరణ్ గోసావి లొంగిపోతానని చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Aryan Khan: Drugs-On-Cruise Case Witness Kiran Gosavi has told that he will surrender shortly in Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X