Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్థర్ రోడ్ జైలు నుండి విడుదలైన ఆర్యన్ ఖాన్; పోలీసుల ఎస్కార్ట్ తో నేరుగా ఆ స్టార్ హోటల్ కు ఆర్యన్ !!

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ దాదాపు నాలుగు వారాల తర్వాత ఈరోజు ముంబై జైలు నుంచి విడుదలయ్యాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆర్యన్ ఖాన్ బెయిల్ పత్రాలు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల లోపు జైలు అధికారులకు చేరకపోవడంతో శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ ఖాన్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు శనివారం ఉదయం 11 గంటలకు,ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్డు జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యారు. 27 రోజుల తర్వాత జైలు జీవితం నుండి విముక్తి లభించింది.

 ఆర్థర్ రోడ్ జైలు వద్ద షారూక్ ఖాన్ బాడీ గార్డ్ .. రేంజ్ రోవర్ లో ఫైవ్ స్టార్ హోటల్ కు

ఆర్థర్ రోడ్ జైలు వద్ద షారూక్ ఖాన్ బాడీ గార్డ్ .. రేంజ్ రోవర్ లో ఫైవ్ స్టార్ హోటల్ కు

షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను తీసుకువెళ్లడానికి షారుక్ ఖాన్ బాడీగార్డ్ రవి ఆర్థర్ రోడ్డు జైలుకు చేరుకున్నారు. జైలు నుండి బయటకు వచ్చిన ఆర్యన్ ఖాన్ తెల్లటి రేంజ్ రోవర్‌లో అక్కడ నుండి వెళ్లిపోయారు. ఆర్యన్ ఖాన్ ను తీసుకెళ్లడానికి వచ్చిన మూడు కార్ల కాన్వాయ్ ఆర్థర్ రోడ్ జైలు నుండి ఫైవ్ స్టార్ హోటల్‌కి ఆర్యన్ ఖాన్‌తో వెళ్ళింది.ఆర్యన్ ఖాన్ కోసం తండ్రితోపాటు లాయర్ల టీం అదే ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశారు. అదే హోటల్ కు ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం చేరుకోనున్నారు.

 ఆర్యన్ ఖాన్ కాన్వాయ్ కి ముంబై పోలీసుల ఎస్కార్ట్ .. ఫ్యాన్స్ కు విజ్ఞప్తి

ఆర్యన్ ఖాన్ కాన్వాయ్ కి ముంబై పోలీసుల ఎస్కార్ట్ .. ఫ్యాన్స్ కు విజ్ఞప్తి

ఆర్థర్ రోడ్డు జైలులో నుండి ఆర్యన్ ఖాన్ ఫైవ్ స్టార్ హోటల్ కు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముంబై పోలీసుల వాహనాలు కూడా ఆర్యన్ ఖాన్ కు ఎస్కార్ట్ ఇచ్చాయి. షారుక్ ఖాన్ అభిమానులను, మీడియాను ఆర్యన్ ఖాన్ మన్నత్ కు చేరుకునే రోడ్లను క్లియర్ చేయాలని, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించవద్దని ముంబై పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఆర్థర్ రోడ్ జైలు అధికారులు తెల్లవారుజామున బెయిల్ పత్రాలను పరిశీలించి ఆర్యన్ ఖాన్ ను విడుదల చేశారు.ఈరోజు ఆర్యన్ ఖాన్ విడుదల నేపథ్యంలో ఉదయం నుండి, అభిమానులు షారుఖ్ ఖాన్ మన్నత్ ఇంటి వెలుపల వెల్ కమ్ హోమ్ ఆర్యన్ అని పెద్ద పోస్టర్లతో హంగామా మొదలుపెట్టారు.

ఆర్యన్ ఖాన్ కేసు వాడింది ముకుల్ రోహత్గీ; దాదాపు నాలుగు వారాల తర్వాత ఆర్యన్ కు విముక్తి

ఆర్యన్ ఖాన్ కేసు వాడింది ముకుల్ రోహత్గీ; దాదాపు నాలుగు వారాల తర్వాత ఆర్యన్ కు విముక్తి

ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మూడు రోజుల పాటు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ కు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు ను జూహీ చావ్లా ఇచ్చారు. ఆర్యన్ ఖాన్ అక్టోబరు 2న క్రూయిజ్ షిప్ పార్టీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దాడి చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఆర్యన్ ఖాన్ దాదాపు అక్టోబర్ ఏడవతేదీ నుండి ఈ రోజు వరకు ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నారు.దాదాపు నాలుగు వారాలు జైలు జీవితం గడిపాడు.

 డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఏ 1 నిందితుడు.. బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్ కు షరతులు

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఏ 1 నిందితుడు.. బెయిల్ పై విడుదలైన ఆర్యన్ ఖాన్ కు షరతులు

మొత్తం 20 మందిని అరెస్టు చేసిన డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను ఏ వన్ నిందితుడిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చార్జిషీట్లో పేర్కొన్నారు.మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ అతని వద్ద ఎలాంటి డ్రగ్స్‌ను కనుగొనలేదు, అయితే అతని వాట్సాప్ చాట్‌లు "అక్రమ మాదకద్రవ్యాల ఒప్పందాలు" మరియు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో అతనికి సంబంధాలు ఉన్నాయని ,వాట్సప్ చాట్ లు అతని ప్రమేయాన్ని రుజువు చేశాయని కోర్టులో పేర్కొంది. బాంబే హైకోర్టు అతని బెయిల్ కోసం 14 షరతులను జాబితా చేసింది .

 ఆర్యన్ కు బాంబే హైకోర్టు విధించిన షరతులివే

ఆర్యన్ కు బాంబే హైకోర్టు విధించిన షరతులివే

ఆర్యన్ ఖాన్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ముంబై వదిలి వెళ్ళకూడదు మరియు ప్రతి శుక్రవారం ఏజెన్సీ ముందు హాజరు కావాలి. సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలను వెల్లడించకూడదు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని, అతని స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ వంటి ఇతర నిందితులతో కమ్యూనికేట్ చేయకూడదని షరతులు విధించింది. ఈ షరతుల్లో దేనినైనా ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కోరవచ్చునని బెయిల్ ఆర్డర్స్ లో పేర్కొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+