Today in Parliament: 'సభ ముందుకు ఎన్నికల చట్టాల సవరణ బిల్లు - ప్రభుత్వ ఆహ్వానం తిరస్కరణ..!!

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు కీలకమైన బిల్లును కేంద్రం సభ ముందుకు తీసుకురానుంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా.. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును సభలో ప్రతిపాదించనుంది. ఇక, ఈ రోజు సభలో మరణించిన ముగ్గురు మాజీ సభ్యులకు సభ సంతాప్రం ప్రకటించనుంది. తరువాత ప్రశ్నోత్తరాలను చేపట్టనుంది. ఇక, పలువురు మంత్రులు తమ శాఖలకు చెందిన పేపర్లను సభకు సమర్పిస్తారు. అయితే, ఈ రోజు కూడా సభలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తొలిగింపును డిమాండ్ చేస్తూ మరోసారి ప్రతిపక్షాలు సభను స్తంభింప చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లఖింపూర్ వ్యవహారం పైనా

లఖింపూర్ వ్యవహారం పైనా

ఇప్పటికే సిట్ ఇచ్చిన నివేదిక మేరకు లఖింపూర్‌ ఖేరీ ఘటన లో ఆయన పాత్ర పైన ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీని పైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే సభలో తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో పాటుగా ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, సభలో కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజీజూ ప్రజాప్రాతినద్య చట్టం 1950, 1951 కు సవరణ కోరుతూ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. కేంద్రం ఆలోచనల మేరకు ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నారు.

ఎన్నికల చట్ట సవరణ బిల్లు ప్రతిపాదన

ఎన్నికల చట్ట సవరణ బిల్లు ప్రతిపాదన

ఓటరు జాబితాలో డూప్లికేషన్ ను నివారించేందుకు ఆధార్ తో అనుసంధానం చేస్తూ ఈ బిల్లును తీసుకువస్తున్నారు. దీని ద్వారా కొత్తగా ఓటరు నమోదయ్యే వారు..ఇప్పటికే ఓటరుగా ఉన్న వారికి సైతం ఆధార్ తో అనుసంధానం చేయనున్నారు. ఇక, గత సమావేశాల్లో అనుచిత ప్రవర్తన కారణంగా రాజ్యసభలో 12 మంది సభ్యులను ఛైర్మన్ సస్పెండ్ చేసారు. వారి పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ విపక్ష పార్టీలు రాజ్యసభలో ఆందోళన చేస్తున్నాయి. అయితే, వారు క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఉపసంహరిస్తామని ఛైర్మన్ స్పష్టం చేసారు.

విపక్షాల సమావేశం.. సభ్యల సస్పెన్షన్ వ్యవహారం

విపక్షాల సమావేశం.. సభ్యల సస్పెన్షన్ వ్యవహారం

ఇక, ఇప్పుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషి ఎంపీల సస్పెన్షన్ పై చర్చిద్దామంటూ ప్రతిపక్ష పార్టీల నేతలను ఆహ్వానించారు. అయితే, ఈ సమావేశానికి రావటానికి విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. అన్ని పక్షాలను పిలిచి చర్చలు చేపట్టకుండా.. కేవలం నాలుగు పార్టీలను ఆహ్వానింటచం పైన అభ్యంతరం వ్యక్తం చేసాయి. తొలుత సభ్యుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆహ్వానం..సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైన విపక్షాలు ఈ రోజు సమావేశమై కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+