వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దమ్ముంటే 15 నిమిషాలు మాట్లాడు, రాహుల్ గాంధీకి ప్రధాని సవాల్, ఒక్క పేరు చెప్పలేవు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ మొదటి సారి మంగళవారం ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ నాయకులు మీద విరుచుకుపడ్డారు. దమ్ముంటే 15 నిమిషాలు మాట్లాడాలని రాహుల్ గాంధీకి ప్రధాని సవాల్ చేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమంతులు, మేము (బీజేపీ) కార్మికులు, మీ మధ్యలో మేము ఎలా కుర్చోవడానికి వీలౌతుంది అంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీకి చురకలు అంటించారు.

దేవుళ్ల ఆశీర్వాదం

దేవుళ్ల ఆశీర్వాదం

కర్ణాటకలోని చామరాజనగర జిల్లా సంతేమరహళ్ళి మండలంలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కన్నడలో తన ప్రసంగం మొదలు పెట్టారు. మొదట మోడీ మంటేస్వామి, హిమవదే రంగనాథస్వామి, బిళిగిరిరంగస్వామి దేవుళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు. మైసూరు మహారాజు రాజా జయచామరాజేంద్ర ఒడయార్, డాక్టర్ రాజ్ కుమార్ తదితర మహానుభావులను గుర్తు చేసుకున్నారు.

6 లక్షల గ్రామాలకు విద్యుత్

6 లక్షల గ్రామాలకు విద్యుత్

ఏప్రిల్ 28వ తేదీన దేశం గర్వించదగిన రోజు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 5.97 లక్షల గ్రామాలకు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించిందని మోడీ చెప్పారు. 2014లో కర్ణాటకలో 39 గ్రామాల్లో పూర్తిగా విద్యుత్ సౌకర్యం కల్పించామని, మీరు ఒక్క గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించలేదని, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని ప్రధాని మోడీ కర్ణాటక సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు.

రాహుల్ గాంధీ సవాల్

రాహుల్ గాంధీ సవాల్

తనకు ఇటీవల రాహుల్ గాంధీ ప్రధాని పార్లమెంట్ లో 15 నిమిషాలు మాట్లాడనిదే కుర్చోవడానికి వీలుకాదని, అది ఆయనకు సాధ్యం కాదని సవాలు విసిరారని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. మీ సవాలుకు తాను ఏమీ బాధపడటం లేదని, సలహాగా తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

దమ్ముంటే మాట్లాడు

దమ్ముంటే మాట్లాడు

రాహుల్ గాంధీ 15 నిమిషాలు మాట్లాడటమే గొప్ప సంగతి, తాను 15 నిమిషాలు మాట్లాడకుండా కుర్చోనని చెప్పడం హాస్యస్పదంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు. దమ్ముంటే చేతిలో కాగితం లేకుండా కర్ణాటకలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవృద్ది పనుల గురించి మాట్లాడాలని రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ సవాలు విసిరారు.

మీరు శ్రీమంతులు

మీరు శ్రీమంతులు

పార్లమెంట్ లో 15 నిమిషాలు మాట్లాడకుండా ప్రధాని నరేంద్ర మోడీ కుర్చోలేరని ఎద్దేవ చేసిన రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమంతులు, మేము కార్మికులు, మేము పని చేసుకుంటూ వెళ్లాలి, శ్రీమంతుల మధ్య ఎలా కుర్చోవడానికి వీలౌతుంది అంటూ ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రాహుల్ గాంధీకి చురకలు అంటించారు.

ఒక్క పేరు సక్రమంగా చెప్పలేవు

ఒక్క పేరు సక్రమంగా చెప్పలేవు

ప్రపంచ ప్రసిద్ది చెందిన సర్ ఎం. విశ్వేశ్వరయ్య పేరు ఐదు సార్లు రాహుల్ గాంధీ తప్పుగా చెప్పారని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు. ప్రపంచ ప్రసిద్ది చెందిన సర్. ఎం విశ్వేశ్వరయ్య పేరు సక్రమంగా చెప్పలేని వ్యక్తి మాతృ బాషలో 15 నిమిషాలు ఏం మాట్లాడగలరని రాహుల్ గాంధీని ప్రధాని నరేంద్ర మోడీ ఎద్దేవ చేశారు.

English summary
Prime Minister Narendra Modi has kick-started his campaign today for the BJP in Karnataka with the first of a series of public rallies staggered over five days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X