వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెకు మగాళ్లను ఆకర్షించే వ్యాధి: ఆశారాం లాయర్

|
Google Oneindia TeluguNews

Asaram Bapu
జోధ్‌పూర్: లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ విచారణను రాజస్థాన్ హైకోర్టు జోధ్‌పూర్ బెంచ్ సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. తదుపరి విచారణ నాటికి

కేసు డైరీని సమర్పించాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది.

సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలానీ ఆశారాం బెయిల్‌పై వాదించారు. గంటకుపైగా తన వాదనలు కోర్టుకు వినిపించారు. జిల్లా, సెషన్స్ కోర్టులలో బెయిల్ పిటిషన్ సమయంలో చేసిన వాదనలే మళ్లీ ఆయన కోర్టుకు వినిపించారు. ఆయన ఎఫ్ఐఆర్‌ను తప్పుపట్టారు. బాలిక వయస్సు, కేసుకు సంబంధించిన మొత్తం వివరాలన్ని సృష్టించినవేనని ఆరోపించారు.

బాధిత బాలిక దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతోందని జఠ్మలానీ తెలిపారు. ఈ వ్యాధి ఉన్న మహిళలు పురుషులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారని పోలీసుల విచారణలో తేలినట్లు ఆయన తెలిపారు. న్యాయవాది వాదనలు విన్న అనంతరం జస్టిస్ నిర్మల్ జీత్ కౌర్ విచారణ సెప్టెంబర్ 18కి వాయిదా వేశారు. తదుపరి విచారణలో తమ వాదనలు వినిపించనున్నట్లు మరో ప్రాసిక్యూషన్ కౌన్సిల్ న్యాయవాది ప్రద్యుమ్న సింగ్ చెప్పారు. ఇక్కడ రెండు కేసు డెరీలున్నాయని, చింద్వారా, అహ్మదాబాద్ ల నుంచి విచారణ చేపట్టాల్సి ఉందని తెలిపారు.

కాగా జిల్లా, సెషన్స్ కోర్టు ఆశారాం, అతని సహాయకుడు శివ లకు సెప్టెంబర్ 30వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. తనకు నరాల బలహీనత తీవ్రంగా ఉందని, చికిత్స కోసం తన వ్యక్తిగత వైద్యురాలినిఅనుమతించాలని కోర్టుకు ఆశారాం విన్నవించాడు. ఆ సమయంలో ఆశారాం తరపు న్యాయవాది హాజరుకాకపోవడంతో తన వినతిని న్యాయమూర్తి తిరస్కరించారు.

నరాల బలహీనతకు చికిత్స చేసేందుకు రోజుకు 2గంటలపాటు తన వ్యక్తిగత వైద్యురాలు నీతను అనుతించాలని కోర్టుకు సెప్టెంబర్ 5న ఆశారాం లేఖ రాశాడు. కాగా కోర్టు దీనిపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.

English summary
The Jodhpur bench of the Rajasthan high court on Monday deferred the hearing on the bail application of Asaram Bapu till September 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X