కాశ్మీర్ వరదసాయంలో విమానయానం: అశోక్, ఏపీపై..
న్యూఢిల్లీ: జమ్మ కాశ్మీర్ వరద బాధితులను ఆదుకోవడానికి చేపడుతున్న సహాయక చర్యల్లో విమానయాన శాఖ కూడా పాల్గొంటోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మంగళవారం తెలిపారు.
బాధితులకు అవసరమైన సామగ్రితో కూడిన రెండు ఎయిరిండియా విమానాలు శ్రీనగర్‌కు వెళ్లాయని తెలిపారు. రోడ్డు మార్గాలు ముంపుకు గురవడంతో కేవలం వాయు మార్గం గుండానే సహాయక చర్యలను చేపట్టాల్సి వస్తోందన్నారు. హెలికాప్టర్ ద్వారా మందులు, ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయమై మాట్లాడుతూ.. విశాఖ విమానాశ్రయం రక్షణ పరిధిలో ఉందని చెప్పారు. పదమూడు జిల్లాలకు పది విమానాశ్రయాలు సాధ్యమేనని చెప్పారు. బీజేపీ వంద రోజుల పాలన నేపథ్యంలో వంద రోజుల్లో తమ శాఖ చేసిన వాటిని అశోక్ గజపతి రాజు వివరించారు.













Click it and Unblock the Notifications