Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజస్థాన్‌లోనూ మణిపూర్ తరహా ఘటన: ప్రశ్నించిన మంత్రిని తొలగించిన సీఎం అశోక్ గెహ్లాట్

జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి రాజేంద్ర సింగ్ గూఢాను తొలగించారు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మంత్రిని తొలగించాలంటూ సీఎం చేసిన సిఫార్సును రాజస్థాన్ గవర్నర్ శుక్రవారం ఆమోదించారని రాజ్ భవన్ తెలిపింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గూఢా విమర్శించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

మణిపూర్ హింసాకాండపై తన సహోద్యోగులు నినదించినప్పటికీ.. మహిళలపై నేరాలను పరిష్కరించడంలో తన స్వంత ప్రభుత్వం విఫలమైందని.. ముందు తమను తాము నిందించుకోవాలని రాజేంద్ర గూఢ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు 2023పై చర్చ జరుగుతున్న సమయంలో మణిపూర్ హింసపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు.

Ashok Gehlot Sacks Minister For Manipur Remark in State Assembly, BJP Slams Rajasthan CM

అయితే రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన నేరాలపై తన స్వంత ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు రాజేంద్ర గూఢ. రాజస్థాన్‌లో మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన తీరు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మణిపూర్ అంశాన్ని లేవనెత్తే బదులు ఆత్మపరిశీలన చేసుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో రాజేంద్ర గూఢా స్పష్టం చేశారు.

మరోవైపు, మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉందంటూ ప్రతిపక్ష నేత రాజేంద్ర రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. రాజస్థాన్‌లో అక్కాచెల్లెళ్లు, కూతుళ్లపై జరుగుతున్న అఘాయిత్యాల వాస్తవికతను కేబినెట్ మంత్రి రాజేంద్ర గూడా స్వయంగా వెల్లడించారని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) ప్రకారం, మంత్రివర్గం సమిష్టి బాధ్యత ఆధారంగా పనిచేస్తుందని, మంత్రి స్థితిని మొత్తం కేబినెట్‌గా పరిగణిస్తారని రాథోడ్ తర్వాత ట్వీట్ చేశారు.

రాజస్థాన్‌లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, దానికి బాధ్యత వహించాలని ఆ రాష్ట్ర హోం మంత్రి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కోరారు. కాగా, నిజాన్ని అంగీకరించే ధైర్యం తనకు లేదని.. అందుకే సీఎం అశోక్ గెహ్లాట్ ఆ మంత్రిని తొలగించారని భారతీయ జనతా పార్టీ విమర్శించింది.

'గెహ్లాట్‌ పాలనలో నిజం మాట్లాడడం నిషిద్ధం.. నిజాన్ని అంగీకరించే ధైర్యం సీఎంకు లేదు! అసెంబ్లీలో తన మంత్రి రాజేంద్ర గూఢాజీ నిజాలు చెప్పినప్పుడు గెహ్లాట్‌కు బాధగా అనిపించి ఆయన్ను పదవి నుంచి తప్పించారు. మీరు నిజాలు మాట్లాడితే మిమ్మల్నేం వదిలిపెట్టరు' అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ వేదికగా వ్యాఖ్యానిచారు.

మణిపూర్ లాంటి ఘోరం రాజస్థాన్‌లోనూ

కరౌలిలోని తోడభీమ్ ప్రాంతంలోని మోహనపురాకు చెందిన దళిత యువతిని జూలై 13న కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత హత్య చేసి బావిలో పడేశారు. ఆమె శరీరంలో యాసిడ్ కాలిన గాయాలు కూడా ఉన్నాయి. అయితే, మరణానికి కారణం తుపాకీ గాయమేనని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. వెనుకబడిన తరగతుల ప్రజలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధ్యక్షురాలు మాయావతి గెహ్లాట్ ప్రభుత్వం ధ్వజమెత్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+