సినీ నటి కావాలనుకుంది కానీ..! అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య

ముంబై: నటి కావాలని కలలు కన్న ఓ యువతి తన అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన గురువారం రాత్రి మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పియరి పంజాబీ అనే 20ఏళ్ల యువతి గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమెకు మాత్రం ఎలాంటి బ్రేక్ రాలేదు. అయినా, తన ప్రయత్నాలను మానుకోలేదు ఆ యువతి.

Aspiring Actress Allegedly Jumps To Death From Mumbai Apartment Terrace

అయితే, సినిమా రంగం వద్దంటూ ఆమె తల్లి ఎంత చెప్పినా పియరి వినలేదు. దీంతో తల్లితో తరచూ గొడవపడేది పియరీ. సినిమా అవకాశాలు రాకపోవడంతో ఆ అమ్మాయి మానసికంగా కృంగిపోయింది. ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఈ నేపథ్యంలో నిరాశ, నిస్పృహలో ఉన్న పంజాబీ గురువారం రాత్రి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అరుపులు, కేకలు వేయడంతో ఆ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే ఆమె మృతి చెందింది.

గురువారం అర్ధరాత్రి తర్వాత 12.15గంటలకు ఆ అమ్మాయి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకిందని సెక్యూరిటీ గార్డ్ తెలిపారు. ఘటన తర్వాత మృతురాలు ఉండే థర్డ్ ఫ్లోర్ నుంచి కేకలు వినిపించాయని చెప్పారు. అమ్మాయి దూకడంతో బయటి నుంచి కూడా కొందరు కేకలు వేశారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+