తమిళ సినిమా సహాయ దర్శకుడి హత్య, ప్రాణం తీసిన టీవీ సౌండ్, స్నేహితుడే హంతకుడు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: టీవీ సౌండ్ తగ్గించే విషయంలో ఇద్దరు తమిళ సినీరంగానికి చెందిన సహాయ దర్శకుల మధ్య గొడవ జరిగింది. ఆ సందర్బంలో ఒకరు హత్యకు గురైన సంఘటన చెన్నైలోని కేకే నగర్ లో జరిగింది. తమిళనాడులోని దిండుగల్ జిల్లా సిలుక్కువార్ పేట్టికి చెందిన అఖీల్ కన్నన్ (35) హత్యకు గురైనాడు.

అఖీల్ కన్నన్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి చెన్నై చేరుకుని వలసవారక్కంలోని కైక్కాన్ కుప్పం ఉవాసీ వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను తమిళ సీనీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పని చేస్తున్నారు. ఇతనితో పాటు కార్తికేయన్ అనే వ్యక్తి సహాయదర్శకుడిగా పని చేస్తున్నారు.

Aspiring Tamil film maker allegedly killed by friend in Chennai

అఖిల్ కన్నన్, కార్తికేయన్ తదితరులు బిక్షగాడు సినిమా ఫేం విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న అన్నాదురై సినిమాకు సహాయ దర్శకులుగా పని చేస్తున్నారు. కార్తీకేయన్ మరో ఆరు మందితో కలిసి కేకే నగర్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి అఖిల్ కన్నన్ స్నేహితుడు నివాసం ఉంటున్న( కార్తికేయన్) ఇంటిలో నిద్రపోతున్నాడు.

ఆ సందర్బంలో కార్తికేయన్ టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టుకుని చూస్తున్నాడు. టీవీ సౌండ్ తగ్గించాలని నిద్రరావడం లేదని అఖిల్ కన్నన్ చెప్పాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాట పెరిగింది. సహనం కోల్పోయిన కార్తికేయన్ గట్టిగా దాడి చెయ్యడంతో అఖిల్ కన్నన్ కుప్పకూలిపోయాడు.

తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్నేహితులు అఖిల్ కన్నన్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తలకు స్కానింగ్ తీయ్యాలని చెప్పారు. స్కానింగ్ తియ్యడానికి వారి దగ్గర డబ్బులు లేకపోవడంతో అఖిల్ కన్నన్ ను ఇంటికి తీసుకు వచ్చారు.

తలకు తీవ్రగాయాలై రక్తం ఎక్కవ పోవడంతో అఖిల్ కన్నన్ మరణించాడు. మరుసటి రోజు అఖిల్ కన్నన్ మరణించాడని గుర్తించిన కార్తీకేయన్ కేకే నగర్ పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు అఖిల్ కన్నన్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి విచారణ చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An aspiring film-maker, who was working as an assistant director in Vijay Antony-starrer upcoming Tamil movie Annadurai, died after a fight with a friend. According to sources, 35-year-old Akil Kannan, who hailed from Dindigul in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి