వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: చిరుతపులి దాడుల కలకలం: 15 మందికి గాయాలు, వ్యాన్‌పై దూకిందిలా!

|
Google Oneindia TeluguNews

దిస్పూర్: ఇటీవల కాలంలో నగరాలు, పట్టణాల్లో చిరుతపులలు సంచారం పెరిగిపోయింది. తాజాగా, అస్సాంలోని జోర్హాట్‌లో ఓ చిరుతపులి దాడులతో ప్రజలను భయాందోళలకు గురిచేసింది. ఈ దాడుల్లో 15 మంది గాయపడగా, వీరిలో ఐదుగురు అటవీశాఖ సిబ్బంది కూడా ఉన్నారు.

గత 24 గంటల వ్యవధిలో ఇక్కడి రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఆర్ఎఫ్ఆర్ఐ) నివాసితులతోపాటు పరిసర ప్రాంతాల్లోని మహిళలు, చిన్నారులపై చిరుత దాడి చేసింది. ఈ చిరుతకు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్ఎఫ్ఆర్ఐ క్యాంపస్‌లో సంచరిస్తున్న ఆ చిరుతపులి.. కంచె దూకి ఓ వ్యాన్ పై దాడి చేసింది. ఓ కారులోంచి ఈ వీడియోను తీసిన కొందరు సోసల్ మీడియాలో పోస్టు చేశారు.

 Assam: At Least 15 Injured In Leopard Attack in Jorhat

చిరుత దాడిలో ముగ్గురు అటవీ సిబ్బంది సహా 13 మంది గాయపడ్డారని జోర్హాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మోహన్ లాల్ మీనా తెలిపారు.
"గాయపడిన వారందరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఎస్పీ తెలిపారు.

'మా బృందం ఆ ప్రాంతానికి చేరుకున్న సమయంలో చిరుతపులి మా ఇద్దరు సిబ్బందిపై దాడి చేసింది. మా రెండవ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. మేము పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాము. చిరుతపులిని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాము. మా మూడు బృందాలు ఇప్పుడు ఇక్కడకు చేరుకున్నాయి' అనిఅటవీ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

అంతకుముందు, ఛత్తీస్‌గఢ్‌లో డిసెంబర్ 12న ఛత్తీస్‌గఢ్‌లోని మనేంద్రగఢ్ జిల్లాలోని కున్వర్‌పూర్ అటవీ ప్రాంతంలోని గధౌరా గ్రామంలో చిరుతపులి దాడిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది.

English summary
Assam: At Least 15 Injured In Leopard Attack in Jorhat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X