రాష్ట్ర ప్రజల చేతికి ఆయుధాలు.. సీఎం సంచలన నిర్ణయం..!

అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా స్థానిక ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలకు గన్ లైసెన్సులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్థానిక ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

అసోం సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల డిమాండ్, భద్రతను దృష్టిలో పెట్టుకుని అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలు, వివాదాస్పద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రత, రక్షణ దృష్ట్యా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాల ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాన్ని మీడియా ముందు వివరించారు.

"అసోం ఒక సున్నితమైన ప్రాంతం. రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అభద్రతా భావానికి లోనవుతున్నారు. మా భద్రత, రక్షణ కోసం ఆయుధ లైసెన్సులు అందించాలని చాలా ఏళ్ల నుంచి అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు" అని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

అసోంలోని ప్రజలు బంగ్లాదేశ్ నుంచి రక్షణ కావాలని.. అలాగే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజల నుంచి భద్రత కావాలని డిమాండ్ ఉంది. అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి నివాసితులు అసోంలోకి ప్రవేశిస్తున్నారని.. వారి నుంచి రక్షణ కావాలని అసోంలోని సరిహద్దు జిల్లాల ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Assam CM Himanta Biswa Sarma Announces Arms Licenses for Residents in Sensitive Areas

ఇతర దేశాలతో సరిహద్దు పంచుకున్న ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ తీర్మానించిందని సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పౌరులను గుర్తించి గవర్నమెంట్ ఆయుధాలు వాడే అనుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+