వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:రాష్ట్రాల మధ్య కాల్పులు -భయానక విధ్వంసం -సీఎంల మాటల యుద్ధం -అమిత్ షా చెప్పినా

|
Google Oneindia TeluguNews

ఈశాన్య భారతంలో మళ్లీ అలజడి రేగింది. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం మరోసారి హింసాత్మక మలుపు తీసుకుంది. అస్సాం-మిజోరాం రాష్ట్రాల మధ్య గట్టు పంచాయితీ ఈసారి కాల్పుల దాకా వెళ్లింది. రెండు రాష్ట్రాలకు చెందిన రైతులు, స్థానికులు, పోలీసులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. సరిహద్దు గుండా ప్రయాణిస్తోన్న వాహనాలను ఆపేసి తుక్కుతుక్కు చేశారు. పట్టపగలు సాగిన ఈ విధ్వంసాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరినొకరు నిందించుకున్నారు. అయ్యా.. జోక్యం చేసుకోండంటూ ఇప్పుడంతా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మొరపెట్టుకుంటున్నారు...

జగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామజగన్ ఆకాశం.. నేనొక ఆఫ్ట్రాల్ గాడిని -విజయమ్మ మాటతో బెయిల్ రద్దుకు-సాయిరెడ్డి బాగోతం: రఘురామ

రెండు రాష్ట్రాల మధ్య కాల్పులు

రెండు రాష్ట్రాల మధ్య కాల్పులు


అస్సాం, మిజోరాం సరిహద్దుల్లో ఆదివారం రాత్రి నుంచి మళ్లీ ఘర్షణలు కొనసాగుతున్నాయి. అస్సాంలోని కచార్ జిల్లా, మిజోరాంలోని కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వెంబడి పెద్ద ఎత్తున పోలీసులు, స్థానికులు, రైతులు మోహరించి ఘర్షణకు దిగుతున్నారు. ఒక రాష్ట్రానికి చెందిన అధికారులపై మరో రాష్ట్రానికి చెందిన పౌరులు దాడులు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కాల్పులు, గ్రనేడ్ దాడులు కూడా జరిగాయని, ప్రభుత్వ వాహనాలపై దాడులు జరిగాయని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి తమ భూభాగంలోని పంటలు, పొలంలో ఏర్పాటు చేసుకున్న మంచెలను అస్సాం అధికారులు కాల్చేశారని మిజోరాం రైతులు ఆరోపిస్తుండగా, సదరు భూభాగం తమదేనని అస్సాం అధికారులు వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజా గొడవ చెలరేగింది. చివరిసారిగా రెండు రాష్ట్రాల మధ్య గత నెలలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కాగా,

జగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలుజగన్ బెయిల్ రద్దు: అదే చివరి ఛాన్స్ -సీబీఐ లాయర్లపై ఎంపీ రఘురామ అనూహ్య వ్యాఖ్యలు

ముఖ్యమంత్రుల మాటల యుద్దం..

ముఖ్యమంత్రుల మాటల యుద్దం..


రెండు రాష్ట్రాల మధ్య సోమవారం యుద్ధ వాతావరణం నెలకొంది. కచార్-కోలాసిబ్ జిల్లాల సరిహద్దు వద్ద ఇరువైపులా వాహనాలను ధ్వంసం చేశారు. సమస్య పరిష్కారం అయ్యేదాకా సరిహద్దు గుండా ప్రయాణించొద్దంటూ కార్లు, బైకులను చిత్తుచిత్తు చేశారు. దాడుల ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. సదరు వీడియోలను కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేస్తూ మిజోరాం, అస్సాం ముఖ్యమంత్రులు ట్విటర్ లోనే మాటల యుద్ధం చేసుకున్నారు. ''అమిత్‌షా గారూ... దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.. గుండాల దాడిలో సామాన్యులు గాయపడుతోన్న తీరును గమనించండి'' అంటూ మిజోరం సీఎం జోరమంతుంగా రాయగా, ''గొడవలు సద్దుమణిగే వరకూ పోలీస్ పోస్టులను వదిలేసి వెళ్లాలని మిజోరాం ఎస్పీ సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మేం ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాం?'' అంటూ అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అమిత్ షాకు ఫిర్యాదుచేశారు.

అమిత్ షా చెప్పినా పట్టింపులేదు

అమిత్ షా చెప్పినా పట్టింపులేదు

ఈశాన్య రాష్ట్రాల మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఇటీవల బీజేపీ సర్కారు నిర్ణయాల కారణంగా అవి హింసాత్మకంగా మారుతున్నాయి. సరిహద్దు గొడవల నేపథ్యంలో ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజుల కిందటే కీలక మీటింగ్ నిర్వహించారు. షిల్లాంగ్ లో జరిగిన ఆ మీటింగ్ లో అస్సాం సర్కారు ఆక్రమణలపై మిజోరాం సీఎం ఫిర్యాదు చేయగా, మిజోరాం పోలీసులు, అధికారులే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అస్సాం సీఎం వాదించారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో చివరికి.. గొడవలు పడొద్దని అమిత్ షా సర్దిచెప్పగా, సీఎంలందరూ సరేనని తలూపారు. సీన్ కట్ చేస్తే, 24 గంటలు తిరిగేలోపే మళ్లీ అల్లర్లు రాజుకున్నాయి. అస్సాం-మిజోరాం రాష్ట్రాలు మూడు జిల్లా వెంబడి 165 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. అస్సాంలో జనాభా పెరుగుతోన్న కారణంగా మిజోరాం భూభాగాన్ని ఆక్రమిస్తోందనే ఆరోపణలున్నాయి. అస్సాంలో బీజేపీ, మిజోరాంలో ఎన్డీఏ ప్రభుత్వాలున్నాయి.

English summary
Fresh violence broke out at the disputed Assam-Mizoram border today -- two days after Union home minister Amit Shah met all Chief Ministers of the northeast at Shillong. There were reports of firing from the border area, which lies over Assam's Cachar district and Mizoram's Colasib district -- and attacks on government vehicles.The Chief Ministers of both states clashed on Twitter, and tagged Union Home Minister Amit Shah in their posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X