వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.14కోట్ల గోల్డ్ కొట్టేసిన ఆర్మీ అధికారి: పట్టించిన స్లగ్లర్!

|
Google Oneindia TeluguNews

ఐజ్వాల్‌: స్మగ్లర్ల నుంచి రవాణా అయ్యే బంగారం, వెండి ఇతర విలువైన సామాగ్రిని పట్టుకుని, ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సిన ఓ అధికారి దొంగలా మారిపోయాడు. స్మగ్లర్ల నుంచి తీసుకొచ్చిన అక్రమ బంగారాన్ని మరికొందరు తోటి ఉద్యోగులతో కలిసి పంచేసుకున్నారు.

అయితే, స్మగ్లర్ అందించిన సమాచారంతో విచారణ చేపట్టిన పోలీసులు.. నిందిత అధికారితోపాటు 39 అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఎనిమిది ఉద్యోగులను పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కల్నల్‌ జస్జిత్‌ సింగ్‌ సహా మరో ఎనిమిది మంది జూనియర్‌ అధికారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

స్మగ్లర్‌ సి లాల్‌నున్‌ఫేలా పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం.. 2015 డిసెంబరులో మయన్మార్‌ నుంచి బంగారం బార్లను తరలిస్తుండగా ఐజ్వాల్‌ వద్ద కొందరు వ్యక్తులు తాము ఎవరో చెప్పకుండా కారు ఆపారు. కారులో ఉన్న తనను, మరో వ్యక్తిని బయట ఎదురుచూడమని చెప్పారు. కారు మొత్తం గాలించి గేర్‌ బాక్స్‌లో రూ.14.5కోట్ల విలువ చేసే 52 బంగారం బార్లు స్వాధీనం చేసుకున్నారని స్మగ్లర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Assam Rifles Commandant Held in Aizawl on Charges of Robbery

వారు బంగారాన్ని తమ కార్లలో పెట్టుకుని తమను బెదిరించడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు చెప్పాడు. బంగారం తీసుకున్నది 39 అసోం రైఫిల్స్‌కు చెందిన వారుగా ఫిర్యాదులో తెలిపాడు. అయితే బంగారాన్ని వారు ప్రభుత్వానికి అప్పగించలేదు. దీంతో స్మగ్లర్‌ 2016 ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

కల్నల్‌ జస్జీత్‌ సింగ్‌ విచారణ కు సహకరించలేదని.. మధ్యంతర బెయిల్‌ కోసం కోర్టుకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్‌ తిరస్కరించడంతో అరెస్టు చేసినట్లు చెప్పారు.

ప్రస్తుతం జస్జీత్ సింగ్ మిజోరాం పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ విషయంపై ఆర్మీ స్పందించడానికి నిరాకరించింది. అయితే కల్నల్‌ జస్జీత్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు ఆర్మీ అధికారుల నుంచి సమాచారం. కాగా, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న స్మగ్లర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

English summary
A Commandant of the Aizawl-based 39th battalion of the Assam Rifles, Col Jasjit Singh was arrested by the police in Aizawl for allegedly being one of the major players in the highway robbery involving Rs 14.5 crore worth of gold bars smuggled from Myanmar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X