ఐదు రాష్ట్రాలు: బిజెపి అసక్తి, సంబరాలు (ఫొటోలు)
హైదరాబాద్: ఐదు రాష్ట్ర్లాల శాసనసభ ఫలితాలు రాష్ట్ర బిజెపికి ఉత్సాహాన్ని నింపింది. ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హవాకు ఈ ఫలితాలు సంకేతమని బిజెపి రాష్ట్ర నాయకులు భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంటుందని వారు భావిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో ఆదివారం బిజెపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డితో సహా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆదివారం ఉదయం నుంచి ఆసక్తిగా ఓట్ల లెక్కింపును, ఫలితాల ధోరణిని పరిశీలిస్తూ వచ్చారు. బిజెపి ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెసు పార్టీని మట్టి కరిపించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెసు వ్యతిరేకత దేశమంతా వీస్తోందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడం ఖాయమని ఆయన అన్నారు.

జి. కిషన్ రెడ్డి
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆసక్తిగా చూస్తూ ఇలా కనిపించారు.

బిజెపి కార్యకర్తల్లో ఆనందం..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా రావడంతో బిజెపి కార్యకర్తలు ఇలా సంబరాలు జరుపుకున్నారు.

ఆనందమానందమాయెనే..
బిజెపి మహిళా కార్యకర్తలు ఐదు రాష్ట్రాల విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ జెండాలు ప్రదర్సిస్తూ సంబరాలు జరుపుకున్నారు.

బండారు దత్తాత్రేయ విక్టరీ సింబల్
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో బిజెపి నేత బండారు దత్తాత్రేయ విక్టరీ సింబల్ చూపుతూ సంబరాల్లో పాల్గొన్నారు.

సంబరాల్లో కిషన్ రెడ్డి..
ఐదు రాష్ట్రాల్లో తమ పార్టీ విజయంతో పార్టీ సంబరాల్లో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలోనూ మోడీ హవా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నారు.

బాణాసంచా పేల్చి..
ఐదు రాష్ట్రాల్లో తమ పార్టీ విజయం సాధించడంతో హైదరాబాదులో ఆదివారం బిజెపి కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications