మూడింట అభివృద్ధి, వ్యతిరేకత: ఛత్తీస్‌గఢ్‌లో సానుభూతి
న్యూఢిల్లీ: ప్రీ ఫైనల్స్‌గా భావిస్తున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కమలం వికసిస్తోంది. మూడుసార్లు ఢిల్లీని ఏలిన షీలా దీక్షిత్ పార్టీనే కాకుండా తాను గట్టెక్కలేకపోయారు. దీంతో ఆమె రాజీనామా చేశారు. ఇక రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అన్ని వర్గాల ప్రజల నుండి ఆదరణ లభించింది. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం బిజెపి చతికిలపడేలా కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాల ఫలితాలపై మోడీ ప్రభావం కనిపించిందంటున్నారు.
లెక్కింపు జరిగిన నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, రాజస్థాన్ కాంగ్రెసు నుండి చేజారుతోంది. ఛత్తీస్‌గఢ్‌ను బిజెపి నిలబెట్టుకోలేకపోతోంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ మూడోసారి విజయపతాకాన్ని ఎగురవేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ నాలుగు రాష్ట్రాల్లో బిజెపి ఆధిక్యత కనబర్చింది.

ఈ ఎన్నికల ద్వారా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, పార్టీల అజెండాలను పక్కన బెడుతున్నారని అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బొగ్గు కుంభకోణం, 2జి కుంభకోణం తదితర లక్షల కోట్ల అవినీతి కాంగ్రెసును దెబ్బతీసిందంటున్నారు. బిజెపి రాష్ట్రాలలోని అభివృద్ధి, యూపిఏ అవినీతి కాంగ్రెసు పార్టీకి చేదును మిగిల్చాయంటున్నారు. అదే సమయంలో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పటికీ సోనియా అజమాయిషీ కేంద్రంపై పరోక్షంగా ఉందని ప్రజలు భావిస్తున్నారని, నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ ధీటుగా నిలబడలేకపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
మధ్యప్రదేశ్‌లో బిజెపి పదేళ్లుగా అధికారంలో ఉంది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైన కాంగ్రెసు ఇక్కడ ఆశలు పెట్టుకుంది. అయితే పదేళ్లుగా శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం గట్టారు. కాంగ్రెసు కంటే శివరాజ్ సింగ్ నేతృత్వంలోని బిజెపినే ప్రజలు ఆదరించారు.
రాజస్థాన్‌లో వసుందరా రాజేకు ఉన్న ఆదరణ.. అదే సమయంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పైన వ్యతిరేకత బిజెపికి కలిసి వచ్చింది. బిజెపికి దూరంగా ఉండే మీనాలు క్రమంగా ఆ పార్టీకి దగ్గరవడం, గెహ్లాట్ పైన వ్యతిరేకత తదితరాలు కలిసి వచ్చాయంటున్నారు. దీనికి తోడు పక్క రాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రభావం కనిపించిందంటున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ లేకుంటే ఢిల్లీలో బిజెపి స్పష్టమైన మెజార్టీతో గెలిచేది అంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార కాంగ్రెసుతో పాటు బిజెపిని అధికంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ పార్టీ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఢిల్లీలో వరుసగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అవినీతి, షీలా ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజలు బిజెపి వైపు మొగ్గేలా చేసిందంటున్నారు. దీంతో ఢిల్లీలో బిజెపి అత్యధిక స్థానాల దిశగా సాగుతోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బిజెపి అధికార దిశగా, ఢిల్లీలో ఆధిక్యం కనబర్చగా... ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం ఫలితాలు దోబూచులాడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెసు అధికార పీఠం కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ కాంగ్రెసుకు సానూభూతి పవనాల వల్లనే ఎక్కువ సీట్లను గెలుచుకుంటోందంటున్నారు.
కొద్ది నెలల క్రితం జరిగిన నక్సల్స్ దాడిలో కాంగ్రెసు పార్టీకి చెందిన కీలక నేతలు మృతి చెందారు. సానుభూతి పవనాల వల్లనే మిగిలిన మూడు రాష్ట్రాల్లో కొట్టుకుపోయిన కాంగ్రెసు ఛత్తీస్‌గఢ్‌లో బిజెపికి ధీటుగా నిలిచిందంటున్నారు. ఇందుకు బస్తర్ ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి అధిక స్థానాలు రావడమే నిదర్శనమంటున్నారు.
-
BRS వ్యూహాత్మక విజయం: కాంగ్రెస్ బహిష్కరణతో గులాబీ జెండా రెపరెపలు -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications