ముగిసిన పోలింగ్: మహారాష్ట్రలో 69%, హర్యానాలో 75%
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బుధవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణకు జరుగుతున్న తొలి పరీక్షగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాల్లోను అధికారంలోకి రావడానికి బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. మహారాష్టల్రో 1999 తర్వాత తొలిసారిగా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్-ఎన్‌సిపి, బిజెపి-శివసేన కూటములు విచ్ఛిన్నమై ఆ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్న తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం.
మహారాష్ట్ర, హర్యానా శానససభ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు మహారాష్ట్రలో 69 శాతం, హర్యానాలో 75 శాతం పోలింగ్ జరిగింది. హర్యానాలోని కురుక్షేత్రలో అత్యధికంగా 75 శాతం పోలింగ్ జరిగింది.
సెలిబ్రిటీలు విజ్ఞప్తి చేసినా మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ ఊపు అందుకోవడం లేదు. అనుపమ్ కేర్ తన భార్యతో వచ్చి ఓటేశారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నర దాటిన తర్వాత కూడా ఓటింగ్ 20 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది.
హర్యానాలో పోలింగ్ ఊపందుకుంటోంది. ఒంటి గంటన్నర ప్రాంతానికి పోలింగ్ 40 శాతం జరిగింది. సల్మాన్ ఖాన్ కూడా తన ఓటు హక్కున వినియోగించుకున్నాడు.
మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు హర్యానాలో 32 శాతం పోలింగ్ నమోదైంది.
మహారాష్ట్రలోని విక్రోలీలో శివసేన, ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు.
మహారాష్ట్రలోని గోండియాలో ఎన్సీపి నేత ప్రఫుల్ పటేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హర్యానాలోని రోహతక్‌లో ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడోసారి తమ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, మహారాష్ట్రను బిజెపి ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేయడాన్ని చూస్తే వారు తాము నమ్మిన నాయుకులనే ఎన్నుకుంటారని చెప్పవచ్చునని శివసేన అధినేత తాను ఓటేసిన తర్వాత అన్నారు.
ఉద్ధవ్ థాకరే తన సతీమణి, కుమారుడు ఆదిత్యలతో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయం 11 గంటల సమయానికి హర్యానాలోని కురుక్షేత్రలో 20 శాతం, యుమనానగర్‌లో 17 శాతం పోలింగ్ నమోదైంది.
హర్యానాలోని దిబ్‌వాలలో ఐఎన్ఎల్‌డి నేత అభయ్ చౌతాలా ఓటేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగపూర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
క్రికెట్ దిగ్జజం సచిన్ టెండూల్కర్ ముంబైలో ఓటేశారు. ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఉదయం తొమ్మిది గంటల వరకు ముంబైలో 7 శాతం పోలింగ్ నమోదైంది.
గత 15 ఏళ్లుగా తాము చేసిన సేవలకు ప్రజలు కాంగ్రెసు పార్టీకి ఓటేస్తారనే విశ్వాసం ఉందని కాంగ్రెసు నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు.
ప్రజలు సుపరిపాలనకు, మోడీ స్థిరమైన నిర్ణయాలనకు ఓటేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ప్రకాష్ జవదేకర్ పూణేలో ఓటేశారు.
శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఓటేసి సెల్ఫీతో ఫొటో తీసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే సోలాపూర్‌లో ఓటేశారు.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలో ఓటేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
బిజెపి దివంగత నేత గోపినాథ్ ముండే కూతురు పంకజ ముండే మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓటేశారు. మహారాష్ట్రలో భారీగా పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
సీనియర్ నేత అజిత్ పవార్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటి రేఖ ముంబైలో ఓటేశారు.
హర్యానాలో సైతం బిజెపి మిత్ర పక్షాలతో పొత్తులకు స్వస్తి చెప్పి, పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దింపి సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. రెండు రాష్ట్రాల్లోను మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఈ నెల 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
రెండు రాష్ట్రాలపైన బిజెపి ఎంతగా ఆశలు పెట్టుకుందో పది రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ 38 ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించడాన్ని బట్టే అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం వహించగా, మహారాష్టల్రో ఎన్‌సిపి ప్రచారాన్ని శరద్ పవార్, శివసేన ప్రచారాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే,ఆయన కుమారుడు అదిత్య థాకరే భుజస్కంధాలపై వేసుకున్నారు.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రధానంగా పంచముఖ పోటీ జరుగుతోంది. 1699 మంది ఇండిపెండెంట్లతో సహా మొత్తం 4119 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 8.25 కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి 1351 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 87.37 లక్షళ మహిళా ఓటర్లు సహా కోటీ 63 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రెండు రాష్ట్రాల్లోను బిజెపికి రాష్టస్థ్రాయిలో చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడం, ప్రధానంగా మోదీ పాపులారిటీపైనే ఆధారపడ్డం మైనస్ పాయింట్లు కాగా, దీర్ఘకాలంలో అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజలనుంచి ఎదురవుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన అడ్డంకిగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ప్రధాన జాతీయ పార్టీల మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ నెలకొని ఉంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications