జయలలిత కోసం మాంసం ముట్టొద్దు! టెస్ట్ చేసి ఆహారం

బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు నుండి విడుదల కావాలని తమిళనాడు వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు పూజలు, ప్రార్థనలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా, జ్యోతిష్యులు అన్నాడీఎంకే కార్యకర్తలకు ఓ సలహా ఇచ్చారని తెలుస్తోంది. జయలలిత విడుదల కోసం మాంసాహారం ముట్టకుండా పూజలు చేయాలని హితవు పలుకుతున్నారని తెలుస్తోంది.

మరోవైపు, అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వానికి చెందిన యాడ్స్ కోసం త్వరలో ఓ ప్రత్యేక ఛానల్ రానుందట.

జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో గత నెల జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే.

జయలలిత

జయలలిత

అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

జయలలిత

జయలలిత

బెయిల్ పిటిషన్ కోసం జయలలిత హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు కర్నాటక హైకోర్టు నిరాకరించింది.

 జయలలిత

జయలలిత

తనకు బెయిల్ ఇచ్చేందుకు కర్నాటక హైకోర్టు నిరాకరించడంతో జయలలిత తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన సుప్రీం 17న విచారణ జరపనుంది.

 జయలలిత

జయలలిత

మరోవైపు, తమ పార్టీ అధినేత్రి కోసం తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనలు, ధర్నాలు, పూజలు కొనసాగిస్తున్నారు.

జయలలిత

జయలలిత


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలులో చాలా కో ఆపరేటివ్‌గా ఉంటున్నారని పరప్పన అగ్రహార జైలు అధికారులు చెప్పారు.

 జయలలిత

జయలలిత

జయలలితకు సపరేట్ సెల్, ఓ టీవీ ఇవ్వడం, యూనిఫాం నుండి మినహాయింపు ఇవ్వడం తప్ప ఆమెకు ఇతరులకంటే ఎక్కువగా ఇచ్చిందేమీ లేదని చెబుతున్నారు.

జయలలిత

జయలలిత

జయలలితకు ఇస్తున్న ఆహారాన్ని ముందుగా పరీక్షిస్తున్నారని తెలుస్తోంది. భద్రతా చర్యల్లో భాగంగానే అధికారులు జయకు ఇస్తున్న ఆహారాన్ని టెస్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+