నితీష్ కుమార్‌పై ప్రశంసలు కురిపించిన నరేంద్ర మోడీ

బీహార్‌ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నందుకు నితీశ్ కుమార్‌ను మోడీ అభినందించారు.

పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. నోట్ల రద్దును నితీష్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో గురువారం బీహార్లో పర్యటించిన మోడీ.. నితీష్‌ను మెచ్చుకున్నారు.

 At First Meet After Notes Ban, PM Narendra Modi's Big Praise For Nitish Kumar

బీహార్‌ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తున్నందుకు నితీశ్ కుమార్‌ను మోడీ అభినందించారు. పాట్నాలో ప్రకాశ్‌ ఉత్సవ్‌ పేరుతో జరిగిన సిక్కు గురువు గోవింద్‌ సింగ్‌ 350వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. నితీశ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడమనేది చాలా కష్టమని, రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారని, ఇది ఒక్క నితీశ్‌ బాధ్యతే అని ప్రజలు భావించకుండా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీహార్ విజయం సాధిస్తే అది మొత్తం దేశానికే స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+