పాకిస్తాన్ నుండి 40 ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబాటు..?

పాకిస్థాన్ నుండి మరోసారి తీవ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సుమారు 40 మంది అనుమానిత ఉగ్రవాదులు చొరబడ్డారనే ఇంటలీజెన్స్ సమాచారంతో లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తవాతవరణం నెలకొంది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇప్పటికే పలువురు ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే...

కనీసం 40 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ వైపు నుండి జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించినట్లు భద్రతా సంస్థ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాయి. కాగా వీరందరిని వివిధ సంస్థలపై దాడులు చేయడానికి పంపి ఉండవచ్చని భద్రతా దళాలు బయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడ నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాదుల చొరబాటుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాల్లోనే నియంత్రణ రేఖ దాటి ఉండవచ్చేనే అభిప్రాయాన్ని జమ్ము కశ్మీర్ పోలీస్ డైరక్టర్ జనర్ దిల్బాగ్ సింగ్ తెలిపారు.

At least 40 terrorists entered Jammu and Kashmir from the Pakistani side..?

అంత్యంత శిక్షణపోందిన ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటరనే సమాచారాన్ని నిఘవర్గాలు హెచ్చరిస్తున్నాయి. నిఘా వర్గాల హెచ్చరిక తర్వాత భద్రత సంస్థలు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. కాగా వీరంతా భారత్‌లో గందరగోళాన్ని సృష్టించే ఆలోచనతో భారత్‌లో చొరబడినట్టు సమాచారం. గతవారం భద్రతా దళాలు ఖలీద్ మరియు నజీమ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశాయి. వీరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటేందుకు సహకరిస్తున్నారనే సమాచారంతో వారిని అరెస్ట్ చేశారు. వారిని పూర్తి స్థాయిలో విచారించడంతో ఈ సమాచారం బయటికి వచ్చినట్టు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+