బెంగాల్ లో తొక్కిసలాట, ఆరుగురు మృతి, పదిమందికి గాయాలు
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని గంగాసాగర్ లో పుణ్యస్నానాలకు వచ్చిన భక్తుల మద్య తొక్కిసలాటతో 6 చనిపోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.
బెంగాల్ :పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగాసాగర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకొంది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. పెద్దఎత్తున భక్తులు రావడంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకొందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కుచ్ బెహరి సమీపంలోని జెట్టి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకొంది.గంగసాగర్ లో పుణ్యస్నానాలకు వచ్చిన భక్తుల మద్య తొక్కిసలాట చోటుచేసుకొంది.

మకరసంక్రాంతి సందర్భంగా గంగసాగర్ లో పుణ్యస్నానాలు చేయడం కోసం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఆదివారం సాయంత్రానికి సుమారు 16 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు.
అయితే భక్తుల ఎక్కువగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకొందని అధికారులు చెబుతున్నారు. ఈ తొక్కిసలాటతో ఓ మహిళతో సహ ఆరుగురు మరణించారు. తొక్కిసలాట సందర్భంగా అక్కడికక్కడే ఇద్దరు చనిపోయారు. సహయక చర్యలను చేపట్టినట్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications