రిలయన్స్ జియో ఆఫర్ క్రెడిట్ అంబానీ పిల్లలదే

ముంబై : నెట్ వినియోగం తప్పనిసరి అయిన ప్రస్తుత పరిస్థితి.. టెలికాం రంగంలో వినూత్న పోటీకి తెరలేపుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం యువతను అమిత ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో ప్లాన్ తెర మీదకు వచ్చింది. రిలయన్స్ ప్రతిష్టాత్మకంగా వెలువరించిన ఈ జియో ప్లాన్ కు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వారసులే ప్రతినిధులు కావడం ఉండడం విశేషం.

ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ (24), కుమార్తె ఈషా ఈ సరికొత్త డేటా ప్లాన్ కు రూపకర్తలు. వాళ్లలో మెదిలిన ఆలోచనకు ప్రతిరూపమే రిలయన్స్ జియో ప్లాన్. రెండేళ్ల క్రితం రిలయన్స్ డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన వీరిద్దరు దీనిపై చాలానే కసరత్తులు చేసినట్లుగా తెలుస్తోంది. డేటా వినియోగం కోసం దేశ యువత సరాసరిన ఎంత డబ్బు ఖర్చు పెడుతోంది.. ఒక నెలలో ఎంత డేటాను ఉపయోగిస్తున్నారు.. అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని.. ఆయా గణంకాల ఆధారంగా రిలయన్స్ జియో ప్లాన్ రూపొందించారు.

రిలయన్స్ యంగ్ డైరెక్టర్లుగా ఉన్న వీరిద్దరు.. నేటి యువ తరానికి ప్రతినిధులుగా నిలబడగలరన్న నమ్మకాన్ని ముఖేష్ అంబానీ వ్యక్తం చేశారు. ముఖేశ్ చేసిన ఈ ప్రకటనకు షేర్ హోల్డర్స్ హర్షం వ్యక్తం చేశారు. ముఖేష్ మాట్లాడుతూ.. ఇండియాలో ఇకనుంచి గాంధీగిరి స్థానంలో డేటా గిరి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అన్ని డేటా చార్జీలతో పోల్చితే 10 శాతం కంటే తక్కువ చార్జీలతోనే తాము డేటాను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

At Reliance Jio Reveal, Spotlight On Junior Ambanis Isha and Akash

జియో ప్లాన్ ను వినియోగించే వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారే అని అభిప్రాయపడ్డ ముఖేశ్.. తమ కంపెనీలో పనిచేసే వారి సగటు వయసు కూడా 30 ఏళ్లే అని ప్రకటించడం గమనార్హం. ఇండియన్ యూత్ కోసం రిలయన్స్ యూత్ డైరెక్టర్స్ తీసుకొచ్చిన జియో టారిఫ్ ప్లాన్ వినియోగదార్లకు కీలకంగా మారబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువారం నాడు జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో మాట్లాడిన ముఖేశ్.. రిలయన్స్ ప్రవేశపెట్టిన జియో ప్లాన్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ముఖేశ్ తో పాటు జియో డైరెక్టర్లు ఆకాష్, ఈషా, చిన్న కుమారుడు అనంత్, ముఖేష్ భార్య నీతా అంబానీ, గ్రాండ్ మదర్ కోకిలా బెన్ పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే జియో ప్లాన్ ను రూపందించిన రిలయన్స్ యంగ్ డైరెక్టర్స్ ఆకాష్, ఈషా కవల పిల్లలు కావడం విశేషం. ఆకాష్ బ్రౌన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా.. ఈషా యెల్ యూనివర్సిటీ నుంచి సైకాలజీ, సౌత్ ఏసియన్ స్టడీస్ లో డబుల్స్ మేజర్స్ గా గ్రాడ్యేయేషన్ గా పూర్తి చేసింది. అనంతరం మెక్ ఇన్సేలో కొన్నాళ్ల పాటు బిజినెస్ విశ్లేషకురాలిగా పనిచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+