ఎస్బీఐ నుంచి గుడ్ న్యూస్... ఈ ఖాతాల్లోనూ ‘మినిమం బ్యాలెన్స్’ ఉంచనక్కర్లేదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. మరికొన్ని రకాల ఖాతాలకు కూడా మినిమం బ్యాలెన్స్ నుండి విముక్తి కల్పించింది.

న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పై ఖాతాదారుల తీవ్ర ఆందోళన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించింది. ఖాతాదారులకు గుడ్ న్యూస్ వినిపించింది. మరికొన్ని రకాల ఖాతాలకు కూడా ఈ మినిమం బ్యాలెన్స్ నుండి విముక్తి కల్పించింది.

ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని.. లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని ఎస్బీఐ అంతకమునుపు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ ఛార్జీల బాదుడు ప్రక్రియను కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది.

At SBI, You Don't Need To Maintain Minimum Balance In These Accounts

అయితే ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీవేస్తారో? మా అకౌంట్ల పరిస్థితేమిటి? అని ఖాతాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళనలపై ఈ ప్రభుత్వ రంగ దిగ్గజం స్పందించింది. కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు పేర్కొంది.

https://twitter.com/TheOfficialSBI/status/851812912289128449/photo/1?ref_src=twsrc%5Etfw&ref_url=http%3A%2F%2Fwww.sakshi.com%2Fnews%2Fbusiness%2Fat-sbi-you-dont-need-to-maintain-minimum-balance-in-these-accounts-467989

స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపింది.

అంతేకాక, కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ మంత్లీ బ్యాలెన్స్ నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. పెన్షనర్లు, విద్యార్థులతో కలుపుకుని మొత్తం 31 కోట్ల మంది డిపాజిట్ దారులపై ఈ మినిమం బ్యాలెన్స్ షరతు ప్రభావం చూపనుందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+