ఆరేళ్ల తర్వాత సోనూ బంగారం వచ్చేశాడు.. : ముద్దుపెట్టిన సుష్మా స్వరాజ్

న్యూఢిల్లీ : భారత విదేశాంగ శాఖ అధికారులు తీసుకున్న చర్యలతో ఆ తల్లిదండ్రుల ఆరేళ్ల నిరీక్షణ సుఖాంతమైంది. 2010లో కనిపించకుండా పోయిన తమ కొడుకు కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోన్న ఆ తల్లిదండ్రుల నిరీక్షణకు తెరదించుతూ భారత హై కమిషన్ ఆ బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చింది.

వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలో సోనూ అనే ఆరేళ్ల బాలుడిని 2010లో ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అప్పటినుంచి అతడి ఆచూకీ కోసం అతని తల్లిదండ్రులు వెతుకుతూనే ఉన్నారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని కాపాడిన జమాల్ ముసా అనే బంగ్లాదేశ్ కి చెందిన సంరక్షణ సంస్థ బాలుడికి తమ దగ్గరే ఆశ్రయం కల్పించింది.

Atlast sonu reached his parents after 6yrs of waiting

బాలుడు జమాల్ ముసాలో ఆశ్రయం పొందుతున్నట్టు తెలుసుకున్న జెస్సోర్ ప్రాంతానికి ఓ వ్యక్తి, గత మే నెలలో విషయాన్ని అతని తల్లిదండ్రులకు చేరవేశాడు. కుమారుడి సమాచారం తెలియడంతో అతన్ని భారత్ తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు బాలుడి తల్లిదండ్రులు.

విషయంపై ఫోకస్ చేసిన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్.. బాలుడిని తీసుకొచ్చే విషయమై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడంతో.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిన అధికారులు మొత్తానికి బంగ్లా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాలుడిని భారత్ కి పంపించే విషయాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చారు.

Atlast sonu reached his parents after 6yrs of waiting

అనంతరం బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో అతడి డీఎన్ ఏ అతని తల్లి ఢీఎన్ ఏ సరిపోలింది. దీంతో బంగ్లా ప్రభుత్వం కూడా బాలుడిని ఇండియా పంపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ లోని భారత దౌత్య అధికారులు గురువారం నాడు సోనూను ఇండియాకు తీసుకొచ్చారు.

Atlast sonu reached his parents after 6yrs of waiting

ఆరేళ్ల తర్వాత కొడుకును చూసిన ఆనందంలో తల్లిదండ్రులు పరవశించిపోగా..! 'వచ్చేశావా బంగారం..' అంటూ కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ బాలుడిని హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టడంఅందరి దృష్టిని ఆకర్షించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+